మోడీ పనితీరు భేష్, ప్రపంచంలో నెం.2: జపాన్ సంస్థ అధ్యయనం
బీజింగ్: అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్న ప్రపంచ దేశాధినేతల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండో స్థానంలో నిలిచారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత నరేంద్ర మోడీ నిలిచారు. జపాన్ దేశానికి చెందిన ఓ మార్కెట్ పరిశోధన సంసథ జీఎంవో రీసెర్చి దీనిపై సర్వే చేసింది.
26వేల మందితో సర్వే నిర్వహించి అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 30 మంది ప్రపంచ నేతలతో జాబితాను రూపొందించింది. అందులో జీ జిన్‌పింగ్ మొదటి స్థానంలో, మోడీ రెండో స్థానంలో ఉన్నారు. జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ మూడో స్థానంలో నిలిచారు.
1 నుండి పది పాయింట్ల వరకు కొలమానం తీసుకోగా జీ జిన్‌పింగ్‌కు 7.5, మోడీకి 7.3, మెర్కెల్‌కు 7.2 పాయింట్లు వచ్చాయి. ఈ సర్వే ఫలితాలను హార్వార్డ్ కెన్నెడీ స్కూల్ యొక్క యాష్ సెంటర్ ఫర్ డెమోక్రాటిక్ గవర్నెన్స్ అండ్ ఇన్నోవేషన్ పబ్లిష్ చేసింది.

జీ, మోడీ, మెర్కెల్ తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ హోలాండే (6.3), జపాన్ ప్రధాని షింజో అబె (6.1), పుతిన్ (6.0), బరాక్ ఒబామా (6.6) బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ (6.5) పాయింట్లతో ఉన్నారు.
తమ దేశ వ్యవహారాలను, అంతర్జాతీయ వ్యవహారాలను ఏ విధంగా చక్కబెడుతున్నారన్న విషయంలో ఆయా నేతల పైన పౌరుల విశ్వాసానికి సంబంధించి అభిప్రాయాలు సేకరించారు. ఈ రెండు కేటగిరిల్లోను వరుసగా 94.8 శాతం, 93.8 శాతంతో జీ జిన్‌పింగ్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక నరేంద్ర మోడీ 93.2 శాతం, 93.3 శాతంతో రెండో స్థానంలో నిలిచారు.












Click it and Unblock the Notifications