మనసులో పెట్టుకోకండి: సీమాంధ్రకి కేసీఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో అన్న మాటలను మనసులో పెట్టుకోవద్దని, హైదరాబాదులో ఉన్న సీమాంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే తాను పంటితో తీస్తానని, సెటిలర్లు అన్న భావనను విడిచి పెట్టుదామని, హైదరాబాదులో ఉన్న వారంతా హైదరాబాదీలేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
పలువురు సీమాంధ్ర నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైవిధంగా మాట్లాడారు. మీరంతా మావాళ్లే అన్నారు. భాగ్యనగర అభివృద్ధిపై ఓసారి మనమంతా సమావేశమవుదామని చెప్పారు. తెలంగాణ మనది అనే భావనతో ముందుకు వెళ్దామన్నారు. తాను మెదక్ నుండి వచ్చానని, కానీ హైదరాబాదీనే అని చెప్పుకుంటానని తెలిపారు. అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని తెలిపారు.
ఉద్యమ అవసరాల్లో చాలా చెబుతామని, ఏడాది తర్వాత కూడా అదే పాట పాడలేమన్నారు. తమ సర్కారుకు ప్రాంతీయ విభేదాలు లేవని చెప్పారు. అందుకే అధికారిక లాంచనాలతో ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు అంత్యక్రియలను జరిపామని చెప్పారు. వనస్థలిపురం, ఎల్బీనగర్, కూకట్ పల్లిలోని సీమాంధ్ర వాసులతో ఓసారి కలిసి భోజనం చేద్దామని చెప్పారు.

కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదాలు లేవని, హైదరాబాద్‌లో నివాసం ఉండేవారంతా హైదరాబాదీలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

కేసీఆర్
ఏ మట్టిలో పుట్టినవారు ఆ ప్రాంతానికి చెందుతారని స్పష్టం చేశారు. ఉద్యమం అన్నది సందర్భాన్ని బట్టి, అవసరాన్నిబట్టి ముందుకొస్తూ ఉంటుందని, ఆ క్రమంలో తెలిసీ తెలియక పొరపాట్లు కూడా జరిగి ఉండవచ్చునన్నారు.

కేసీఆర్
ఇప్పుడు ఆ పాత విషయాలగురించి ఆలోచించొద్దని సూచించారు. సెటిలర్స్ అన్న భావన విడిచిపెట్టాలన్నారు. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

కేసీఆర్
సీఎం నివాసంలో ఆయన సమక్షంలో వెయ్యిమందికి పైగా కూకట్‌పల్లి ప్రాంతీయులు తెరాసలో పార్టీలో చేశారు. దాదాపు 58 ఏళ్లు కలిసి ఉన్నామని, కానీ విడిపోవాల్సిన అవసరం వచ్చిందని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్
అందుకే పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ సాధించుకున్నామన్నారు. అంతేకానీ తెలుగువారి మధ్య విభేదాలేమీ లేవని, హైదరాబాద్‌లో బతుకుతెరువు కోసం వచ్చినవారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మీరు ధైర్యంగా ఉండాలన్నారు.

కేసీఆర్
మీ(సెటిలర్ల) కాలికి చీమ కుడితే నా కాలుకు ముల్లు గుచ్చుకున్నట్టు బాధపడతానని, మీ కాలికి ముల్లు దిగితే పంటితో తీసేస్తానని చెప్పారు. అయినా, హైదరాబాద్‌లో స్థిరపడినవారెవరూ సెటిలర్స్ కాదని, ఈ భావనతోనే ప్రముఖ నిర్మాత డి రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని తెలిపారు.

కేసీఆర్
రామానాయుడు ఎంతో కష్టపడి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు చేశారని, తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి అని, ఆయన పిల్లలు ఇక్కడే పుట్టారని, వారిని వేరే ప్రాంతం వారని అనలేమని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్
గోదావరిఖనిలో గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన కుటుంబాల్లో తనకు స్నేహితులు ఉన్నారని, సంక్రాంతికి ఊరికి వెళదామని తల్లిదండ్రులు అంటే.. మనది ఈ ఊరే కదా అని వాళ్ల పిల్లలు అంటారని, అలాగే, నాది మెదక్ అని గుర్తు చేశారు. అయినా హైదరాబాద్ అని చెప్పుకుంటానన్నారు.

కేసీఆర్
తన మనవడు కూడా అదే అంటాడన్నారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో మార్పు చూస్తారని, తెలంగాణ అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుందని, మన పిల్లలందరికీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో నివసించే ప్రతి వ్యక్తి బాధ్యత ముఖ్యమంత్రిగా తనదేనని, ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.

కేసీఆర్
అబద్ధాలు మాట్లాడటం తనకు నచ్చదని, చెప్పే విషయమేదైనా ముఖం మీదే మాట్లాడటమే తన పద్ధతి అని, తాను చెప్పిన మాటలను వందశాతం చేసి చూపిస్తానన్నారు. మనసులో ఏమీ పెట్టుకోవద్దని, అందరం తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం అభ్యర్థించారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications