వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై పోరు: పవన్ కళ్యాణ్ కెవ్వుకేక (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించి హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో కెవ్వు కేక అనిపించారు. కెరటంలా వచ్చి సుడిగాలి పర్యటనలు చేసి ఆయన రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపారనే అభిప్రాయం బలపడింది. సహజంగానే పవన్ కళ్యాణ్‌ది ఉద్వేగపూరితమైన మనస్తత్వమని, ఆ ఉద్వేగంలో తాను అనుకున్నదేమిటో కుండబద్దలు కొడుతారని అనుకుంటారు. అలాగే ఆయన వ్యవహరించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లాల్సిన రీతిలో వెళ్లాయనే అభిప్రాయం ఉంది. సెజ్‌ల ద్వారా భూములను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కొల్లగొట్టిన విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటించిన 20 నియోజకవర్గాల్లో ఒకటిరెండు తప్ప అని నియోజకవర్గాల్లో బిజెపి, టిడిపి కూటమి విజయం సాధించింది.

నరేంద్ర మోడీ హవాకు పవన్ కళ్యాణ్‌పై ప్రజలకు ఉన్న ఆదరణ తోడైందని అంటున్నారు. జగన్ విశ్వసనీయతను, పారదర్శకతను ప్రజల ముందు పవన్ కళ్యాణ్ నిలదీసిన తీరు ఫలితం ఇచ్చిందని అంటున్నారు. జగన్ సమైక్య నినాదంలోని డొల్ల తనాన్ని ప్రజల గుండెల్లో నాటుకునేలా చేశారనే అభిప్రాయం ఉంది.

పవన్ కళ్యాణ్ హ్యాపీ

పవన్ కళ్యాణ్ హ్యాపీ

ఫలితాలలు బిజెపికి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆయన చాలా ఆనందంగా కనిపించారు.

విజయం సాధించా...

విజయం సాధించా...

మీడియా సమావేశంలో మాట్లాడడానికి వచ్చినప్పుడు విజయం సాధించాననే భావన ఆయనలో స్పష్టంగా కనిపించింది. పిడికిలి బిగించి ఇలా కనిపించారు.

సాయుధ పోరాటం చేద్దామనుకున్నా...

సాయుధ పోరాటం చేద్దామనుకున్నా...

ప్రస్తుత స్థితికి ఆగ్రహంతో తాను సాయుధ పోరాటం చేద్దామని అనుకున్నానని, అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో మార్పు వస్తుందని ఫలితాలు నిరూపించాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

అభివృద్ధి జరుగుతుంది..

అభివృద్ధి జరుగుతుంది..

ఫలితాలు అనుకూలంగా వస్తున్న క్రమంలో చంద్రబాబు, నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారు.

English summary

 Jana Sena chief Pawan Kalyan hs succeeded in mould tha public opinion against YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X