జగన్‌పైనే గురి: ఎన్నికల్లో చంద్రబాబుతోనే పవన్ కల్యాణ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి వెళ్లడానికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. తనతో పాటు వామపక్షాలను కూడా ఆయన తన వెంట తీసుకుని వెళ్తారనే ప్రచారం సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతారని అంటున్నారు. బిజెపి తెలుగుదేశం పార్టీకి దూరమైన నేపథ్యంలో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

టిడిపి, జనసేన, వామపక్షాలు మహా కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మతతత్వ పార్టీగా భావిస్తూ బిజెపిని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మహా కూటమిలోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఆచితూచి అడుగులు

ఆచితూచి అడుగులు

తన జనసేన పార్టీని పవన్ కల్యాణ్ మూడేళ్ల క్రితం స్థాపించారు. అయితే, ఇప్పటి వరకు వ్యవస్థాగత నిర్మాణం జరగలేదు. ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల వారీ సేవాదళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన లక్ష్యాలను ఖరారు చేసి, స్పష్టత ఇవ్వడానికి ముందే వ్యూహాన్ని ఖరారు చేసుకునే దిశగా పవన్ కల్యాణ్ సాగుతున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Vs Balakrishna : Who Will Get Anantapur In 2019 Elections - Oneindia Telugu
సమస్యలపై పోరాటమే...

సమస్యలపై పోరాటమే...

పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి కన్నా దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఆయన చంద్రబాబుతో కలిసి పని చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కార బాధ్యతను తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అందుకు చంద్రబాబు సహకారం కూడా తీసుకున్నారు. రానున్న రోజుల్లో చేనేత కార్మికుల సమస్యలతో పాటు అవయవదానం ప్రాజెక్టును కూడా చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరిన్ని సమస్యలను కూడా గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్ర చేస్తారా...

పాదయాత్ర చేస్తారా...

సమస్యలను గుర్తించిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అక్టోబర్ నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర ఆలోచన కూడా ఆయనకు ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యల్లో కాపు సమస్య ఒకటి అని, కులంతో ముడిపెట్టి దాన్నే ప్రధాన సమ్సయయగా చూడకూడదని ఆయన భావిస్తున్నారు. ఆ రకంగా మిగిలిన కులాల వారిని దూరం చేసుకోకుండా ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు.

బిజెపికి, వైసిపికి సంకేతాలు.

బిజెపికి, వైసిపికి సంకేతాలు.

రానున్న రోజుల్లో రాజకీయ పునరేకీకరణ విషయంలో పవన్‌కల్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు దగ్గర కావడం ద్వారా బిజెపికి, వైసిపికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. పార్టీ ఇప్పటికిప్పుడు అద్భుతాలు చేస్తుందని ఆయన చెప్పడం లేదు. అద్భుతాలు చేయాలని కూడా అనుకోవడం లేదు. అందువల్ల నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే సేవాదృక్పథం గల కార్యకర్తలను ఆయన ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విమర్శలు చేయడం కన్నా సమస్యలను పరిష్కరించే దిశలో పనిచేయాలని ఆయన అనుకుంటున్నారు.

కెసిఆర్ మాటను కూడా..

కెసిఆర్ మాటను కూడా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపికి అనుకూలంగా 45శాతం మంది మొగ్గుచూపుతున్నారని, టిడిపి వైపు 43శాతం మంది మొగ్గు చూపుతున్నారని, బిజెపికి 2.6శాతం, జనసేనవైపు ఒక శాతం మంది మొగ్గు చూపుతున్నారని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కల్యాణ్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసే కన్నా ప్రజల మనసులను చూరగొనడానికి అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

జగన్‌తో బిజెపి....

జగన్‌తో బిజెపి....

టిడిపి, జనసేన, వామపక్షాలు మహాకూటమి కడితే అనివార్యంగా బిజెపి జగన్‌కు దగ్గరవుతుందని భావిస్తున్నారు. అక్టోబర్ 27 నుండి పాదయాత్ర చేయనున్నట్టు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్‌ను ఎదుర్కోవడమే ఎజెండాగా పవన్ కల్యాణ్ వ్యూహరచన ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్థితిలో సెప్టెంబర్ 2వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Jana Sena chief Pawan Kalyan may forge alliance with Telugu Desam party (TDP) chief Nara Chandrababu Naidu to fight against YSR Congress party president YS Jagan in Andhra Pradesh.
Please Wait while comments are loading...