టి ఎందుకు: కెసిఆర్‌కు ఓయులో రివర్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చటంద్రశేఖర రావు పైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిప్పులు చెరిగారు.
రేపటి తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులెవ్వరూ ఉండరని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ శాశ్వత ఉద్యోగులుగా చేస్తామంటే తమ పరిస్థితి ఏమిటని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మండిపడ్డారు.
'కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే మా భవిష్యత్తు ఏమైపోవాలి?' అంటూ సోమవారం ఉస్మానియా ఎన్‌సిసి గేటు వద్ద ఓయూ ఐకాస విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

ఓయు
తాము పగలనక, రాత్రనక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నామని, తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులనే పర్మినెంట్ చేసినప్పుడు కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయని, తమ గతేం కావాలని విద్యార్థులు ప్రశ్నించారు.

ఉస్మానియా
1969 తెలంగాణ ఉద్యమం, 1972 జై ఆంధ్ర ఉద్యమం ఉద్యోగుల అంశాలకు సంబంధించే వచ్చాయని, తాజా తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం కూడా ఉద్యోగాల సమస్యేనని, 60 సంవత్సరాలుగా ఉద్యోగాల కల్పన కోసమే పోరాడామన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, మరి కాంట్రాక్టు ఉద్యోగులనే పర్మినెంట్ చేస్తే నిరుద్యోగులకు ఏం న్యాయం జరిగినట్లని, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అంతేకానీ, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి కాదని మండిపడ్డారు.

ఓయు విద్యార్థులు
ఇక నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రారంరంభం కావాలా? తాము ఏ వ్యక్తిని, పార్టీని లక్ష్యం చేసుకుని మాట్లాడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వ్యవస్థనే ప్రశ్నిస్తున్నామన్నారు. నడరం ఏ పార్టీతోనూ సంబంధం యతేబవ, జనరల్ విద్యార్థులుగా ఉద్యమిస్తున్నామని విద్యార్థులు అన్నారు.

విద్యార్థులు
ఈ అంశం పైనే మంగళవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నామని చెప్పారు. 24 గంటల్లో పార్టీలు మాకు సమాధానం చెప్పాలన్నారు. తమకు అభయం ఇవ్వాలన్నారు. లేదంట వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో తమ కుటుంబాలకు తెలుసునని హెచ్చరించారు. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications