మోడీ, పవన్, బాబు: హిట్ కాంబినేషనా? (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అనూహ్యమైన కాంబినేషన్ ఏర్పడింది. కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్న బిజెపి నేత నరేంద్ర మోడీ, సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వారికి సహకరించడానికి సిద్ధపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతో ఆ కాంబినేషన్ ఏర్పడింది.
మోడీ హవా రాష్ట్రంలో ఉన్నట్లే అనిపిస్తోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గట్టిపోటీ ఇచ్చేట్లే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులకు అభిమానులు చప్పట్లు కొడుతున్నారు. ఇదంతా కలిసి వారి ముగ్గురి ఆకాంక్షలను నెరవేరుస్తుందా అనేది ప్రశ్న.
గురువారంనాడు ఆ ముగ్గురు కూడా బిజెపి నేత ఎం. వెంకయ్యనాయుడిని వెంట బెట్టుకుని సీమాంధ్రలో ఐదు బహిరంగ సభలను ఊపేశారు. జగన్‌ను, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యం చేసుకుని పవన్ కళ్యాణ్ ఊగిపోయారు. పవన్ కళ్యాణ్‌ను చూసి వారిద్దరిపై పంచ్ డైలాగులు విసిరేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. మొత్తం మీద, ఒక వాతావరణాన్ని మాత్రం ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్, పవన్, బాబు చిత్రాలు..
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎన్టీ రామారావు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాలను పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు.

గుంటూరులో ముగ్గురు
బుధవారం గుంటూరులో జరిగిన బహిరంగ సభలో మోడీ అభివాదం చేస్తూ కనిపించారు. పవన్ కళ్యాణ్ ఇలా కనిపించారు. చంద్రబాబు అభివాదం చేస్తూ కనిపించారు.

వైసిపి హఠావో, సీమాంధ్ర బచావో..
పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో వైసిపి హఠావో, సీమాంధ్ర బచావో అనే నినాదం ఇచ్చారు. జగన్‌ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేశారు.

చంద్రబాబు ఇలా..
చంద్రబాబు కూడా జగన్‌పై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మోడీ నినాదం స్వర్ణాంధ్ర, స్కామాంధ్ర
స్వర్ణాంధ్ర కావాలో, స్కామాంధ్ర కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని, తమకు అధికారం ఇస్తే సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని మోడీ చెబుతూ వచ్చారు.

మదనపల్లిలో ఇలా..
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆ రాజకీయ కాంబినేషన్ వేదిక మీద ఇలా కనిపించింది. ఠాగోర్ జనగణమన రాసిన నేల అని మోడీ గుర్తు చేశారు.

వెంకయ్యతో పురంధేశ్వరి..
మదనపల్లి మోడీ, పవన్, చంద్రబాబుల ప్రచార సభలో రాజంపేట బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి వెంకయ్యతో మాట్లాడుతూ ఇలా కనిపించారు.

చంద్రబాబు దూరమే..
మదనపల్లి సభలో మోడీతో పురంధేశ్వరి మాట్లాడుతూ కనిపించారు. పురంధేశ్వరిని గెలిపించాలని కోరిన చంద్రబాబు మాత్రం ఆమెకు దూరంగానే ఉన్నారు.

ఐదు సభలూ ఇలాగే..
నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురువారంనాడు సీమాంధ్రలో ఐదు సభల్లో పాల్గొని ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications