బందరు టెక్కీ రేప్, హత్య: టాక్సీ డ్రైవర్ల పనేనా?
ముంబై: ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య హత్య జరిగిన ముంబైలోని స్థ్లలంలో రక్తం మరకలతో కూడిన మఫ్లర్ లభ్యమైంది. అనూహ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ మఫ్లర్ నిందితుడికి సంబంధించింది కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
బందరుకు చెందిన అనూహ్య జనవరి 5వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. సగం కాలిన స్థితిలో ఆమె మృతదేహం జనవరి 16వ తేదీన బయటపడింది. సంఘటనాస్థలంలో దరిగిన మఫ్లర్ మృతురాలికి సంబంధించిందా, నిందితుడికి సంబంధించిందా అనే విషయాన్ని తేల్చడానికి దాన్ని కలినా ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించారు. డిఎన్ఎ పరీక్షలు కూడా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు.

అనూహ్యపై అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి వైద్య పరీక్షల నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. అనూహ్యపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె వేలి ఉంగరాన్ని గానీ, సెల్‌ఫోన్‌ను గానీ తీసుకుని వెళ్లలేదు. దీంతో మరో కారణం వల్ల ఆమె హత్య జరిగిందని చెప్పడానికి వీలు లేదని అంటున్నారు.
మఫ్లర్‌ను బట్టి టాక్సీ డ్రైవర్స్ గానీ ఆటో రిక్షా డ్రైవర్స్ గానీ నేరం చేసి ఉండవచ్చునని పోలీసులు అనుకుంటున్నారు. చలిని తట్టుకోవడానికి డ్రైవర్లు మఫ్లర్లు చుట్టుకోవడం పరిపాటి. దానివల్ల పోలీసులు ఆ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మఫ్లర్ ఫొటోను తీసుకుని పోలీసులు దాన్ని ధరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు టాక్సీ డ్రైవర్లను, ఆటో రిక్షా డ్రైవర్లను విచారించారు. అయితే, జనవరి ఐదో తేదీ నుంచి కనిపించకుండా పోయిన టాక్సీ డ్రైవర్ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. దాదాపు 400 మంది ఆటో, ఆటో రిక్షా డ్రైవర్లను పోలీసులు పరిశీలించారు. ఆ రోజు ఎల్‌టిటి చుట్టుపక్కల వాడిన సెల్‌ఫోన్స్ కాల్ రికార్డులను పోలీసులు సేకరిస్తున్నారు. చలి విపరీతంగా ఉండడంతో అనూహ్య ఆ రోజు టాక్సీని మాట్లాడుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications