వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ గ్రూప్ సర్వే: మోడీకి పోటీయే లేదు, రాహుల్ తుస్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రజాదరణపై చర్చ సాగుతోంది. గుజరాత్‌ పీటం మళ్లీ బిజెపిదేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతన్నాయి. ఈ నేపథ్యంలో టైమ్స్ గ్రూప్ మెగా ఆన్‌లైన్ సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

Recommended Video

రాహుల్ పట్టాభిషేకం, వీడియో ! | Oneindia Telugu

మోడీకి పోటీయే లేదని, ఆయన భారతదేశం అత్యంత ప్రజాదరణ గల నేత అని టైమ్స్ గ్రూప్ మెగా సర్వేలో తేలింది. లోకసభ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారంటూ పది టైమ్స్ గ్రూప్ మీడియా ప్రాపర్టీస్ ద్వారా 9 భాషల్లో ఈ సర్వే జరిగింది.

ఆ ప్రభావం సున్నా...

ఆ ప్రభావం సున్నా...

నోట్ల రద్దు, జిఎస్టీ మోడీపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే అభిప్రాయం ఉంది. అయితే, అవేవి కూడా మోడీ ప్రజాదరణను దెబ్బ తీయలేదని సర్వేలో తేలింది. మోడీ ప్రభుత్వం 2109 ఎన్నికల్లో కూడా తిరిగి వస్తుందని 79 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆ సర్వే ఇలా....

ఆ సర్వే ఇలా....

మూడు విభాగాలుగా సర్వేను 72 గంటల పాటు డిసెంబర్ 12 15 తేదీల్లో నిర్వహించారు. ఆ సర్వేలో దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారు. 20 శాతం మంది మాత్రమే తాము కాంగ్రెసుకు ఓటు వేస్తామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ మోడీతో నేరుగా తలపడితే కాంగ్రెసుకు ఓటేస్తామని 20 శాతం మంది చెప్పారు.

ఇది ఆసక్తికరం

ఇది ఆసక్తికరం

రాహుల్ గాంధీ విషయంలో ఆసక్తికరమైన విషయం సర్వేలో వెల్లడైంది. రాహుల్ గాంధీ ఆకట్టుకోలేరని 58 శాతం మంది అభిప్రాయపడగా, గాంధీ వారసుడు ఓటర్ల ద్వారా కొత్త సంబంధాలను ఏర్పరుచుకుంటారని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ప్రత్యామ్నామే కాదు...

ప్రత్యామ్నామే కాదు...

రాహుల్ గాంధీ పదోన్నతి పొందిన తర్వాత కూడా కాంగ్రెసు బిజెపికి ప్రత్యామ్నాయం కాలేదని సర్వేలో 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి రాహుల్ గాంధీ మోడీని ఎదుర్కోవడం అంత సులభంగా కనిపించడం లేదు.

English summary
Prime Minister Narendra Modi remains India's most popular leader with no competition in sight, according to a mega online survey by the Times Group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X