వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఆర్పీ పునరుద్ధరణ?: పవన్‌కల్యాణ్‌పై సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Will Pawan lead renewal PRP!?
ఐదేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మళ్లీ ఉనికిలోకి రానుందా? అంటే కావొచ్చుననే ప్రచారం సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మద్దతుతో పిఆర్పీని తీసుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట! ఆ దిశగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్ర నినాదంతో ఆ పార్టీని మళ్లీ తెర పైకి తీసుకు వచ్చేందుకు చూస్తున్నారట.

గతంలో ఆ పార్టీలో పని చేసిన నేతలే పార్టీని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించి సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట. ఇందుకు పవన్ కల్యాణ్ మద్దతు కూడగట్టగలిగితే తమకు ఎదురు ఉండదని అంచనా వేస్తున్నారట. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరు ఏడాదిన్నర క్రితం కాంగ్రెసులో విలీనం చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవితోపాటు, ఆయన అనుయాయులు సి రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావుకు రాష్ట్రంలో మంత్రి పదవులు లభించాయి. అయితే, పిఆర్పీని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేసిన తీరు ఆయన సోదరుడు పవన్ కల్యాణ్‌కు ఏమాత్రం రుచించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటి నుంచీ చిరంజీవి - పవన్ కల్యాణ్ సంబంధాలు ఎడ ముఖం-పెడ ముఖంగానే ఉన్నాయనే ప్రచారం సాగింది.

ఈ నేపథ్యంలోనే పిఆర్పీ పునరుద్ధరణ దిశగా తాజాగా ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గతంలో పిఆర్పీ జెండా మోసిన ముఖ్యుల్లో కొందరు, ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారిలో మరికొందరు ఈ దిశగా ఆలోచిస్తున్నారట. సమైక్యాంధ్ర నినాదంతో రంగంలోకి దిగాలని వీరు ఆలోచిస్తున్నారు. సీమాంధ్రలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పిఆర్పీకి మంచి భవిష్యత్తు ఉంటుందని వారు భావిస్తున్నారు.

సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా క్షీణించిపోవడం, టిడిపిపై పలు వర్గాల్లో వ్యతిరేకత ఉందనే అభిప్రాయం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్టీ అవినీతి పార్టీగా ముద్రపడిపోవడం వంటి కారణాలతో పిఆర్పీకి జనాదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారట. అయితే, పిఆర్పీ పునరుద్ధరణపై చిరంజీవితో ఓ నేత చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దానికి చిరు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా స్పందించలేదట.

అయితే, పార్టీ పునరుద్ధరణకు మాత్రం పలువురు సీరియస్‌గానే ప్రయత్నాలు సాగిస్తున్నారట. సుమారు 50-60 మంది నాయకులు రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో పిఆర్పీ విలీనాన్ని వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ తమకు మద్దతు ఇస్తారని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే జరిగితే చరిత్ర సృష్టించడం ఖాయమని భావిస్తున్నారట.

అయితే, గతంలో చిరుతో విభేదించిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగినా అదంతా వట్టిదే అని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ సోదరుడికి వ్యతిరేకంగా పిఆర్పీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని, చిరుతో విభేదిస్తే సైలెంట్ అయిపోతారే కానీ ఆయనకు పోటీగా దిగే అవకాశాలు లేవని కొందరు అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ మద్దతు కోరితే రంగంలోకి దిగుతారా లేదా అనేది సస్పెన్స్‌గానే ఉందని చెప్పవచ్చు.

English summary
It is said that some Seemandhra leaders are trying to renewal Chiranjeevi's Prajarajyam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X