టిడిపి ట్విస్ట్‌తో మూడింట: జగన్ తూర్పుకెళ్తున్నారా

రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా నుండి పోటీ చేయనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పోటీ చేయరని, ఆమె పులివెందుల స్థానం నుండి జగన్ పోటీ చేస్తారనే వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి. అయితే, ఇప్పుడు జగన్ తూర్పు నుండి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. అదే సమయంలో విజయమ్మ మళ్లీ పులివెందుల నుండి పోటీ చేయవచ్చునంటున్నారు.

ఇటీవల టిడిపిలోకి వలసల జోరు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రభావం తమ పార్టీ పైన ఉండవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోందట. ఈ కారణంగా... మూడు ప్రాంతాల్లో ముగ్గురు.. జగన్, షర్మిల, విజయమ్మ పోటీ చేయవచ్చునంటున్నారు. పులివెందుల నుండి విజయమ్మ, తూర్పు నుండి జగన్, విశాఖ నుండి షర్మిల పోటీ చేసే అవకాశాలు కొట్టి పారేయలేమంటున్నారు.

ఇటీవల జగన్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని టిడిపి, జై సమైక్యాంధ్ర పార్టీలు చెబుతున్నాయి. అది నిజమే అన్నట్లు టిడిపిలోకి వలసలు వస్తున్నారు. దీంతో మూడు ప్రాంతాల్లో గట్టెక్కేందుకు జగన్ నియోజకవర్గం మార్పును క్యాడర్ కోరుకుంటుందట. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడిపికి బాగా అనుకూలంగా ఉందని కొన్ని సర్వేల్లో తేలడంతో జగన్ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైందంటున్నారు.

దీంతో, జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి కాకుండా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ వర్గాలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నాయట. వైయస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి ఎవరిని నిలబెట్టినా సునాయాసంగా గెలుస్తారని, ఈసారి పార్టీకి కాస్త క్లిష్టంగా ఉన్నచోటు నుంచి పోటీ చేస్తే ఆయనతోపాటు మరికొంతమంది అభ్యర్థులను గెలిపించుకుని ఎక్కువ సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుందని జగన్‌కు సూచించారట.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

పులివెందుల నుంచి ఈసారి తానే పోటీ చేస్తానని, తన తల్లి విజయమ్మను ఎన్నికలకు దూరంగా ఉంచుతామని జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

కానీ, పార్టీ వర్గాల వాదన మరోలా ఉంది. టిడిపిలోకి చేరికల నేపథ్యంలో తూర్పు గోదావరి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని కొందరు జగన్‌కు సూచన ఇచ్చారట. ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారట. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ మెరుగైన సీట్లు సాధించాలంటే జగన్ అక్కడి నుండి పోటీ చేయాలని చెబుతున్నారట.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

తూర్పు నుంచి జగన్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటుందని దాంతో, టిడిపి మెజారిటీని తగ్గించడంతోపాటు పార్టీ మరిన్ని సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుందని జగన్‌కు వారు సూచించారట.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 36 అసెంబ్లీ, ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ స్థానాలతో అత్యధిక సీట్లున్న జిల్లాగా తూర్పు గోదావరికి పేరుంది. దీనికి తోడు, తూర్పు ఎటో తీర్పు అటు అన్న నానుడి ఉండనే ఉంది.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఈ నేపథ్యంలోనే, ఇక్కడి నుంచి పోటీ చేస్తే మెజారిటీ సీట్లను గెలుచుకోవడమే కాకుండా టిడిపిని కొంతలో కొంతైనా దెబ్బ తీయవచ్చని జగన్‌కు వారు సూచిస్తున్నారు. జగన్ సోదరి షర్మిల విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నందున మొత్తం మూడు జిల్లాల్లో జగన్ పార్టీ ఎక్కువ శాతం ఓట్లు సాధించుకునే వీలుంటుందని వివరించారు.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

పులివెందుల నుంచి మళ్లీ విజయమ్మ పోటీ చేస్తే.. సీమాంధ్రలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహించినట్టు అవుతుందని అన్నట్లు తెలిసింది.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

ఈ నేపథ్యంలో, జగన్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పులివెందుల నుంచి విజయమ్మనే మళ్లీ పోటీలోకి దించి ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబడవచ్చునంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+