'ఏపీకే లాభమన్నారు, కేసీఆర్-వైయస్ ఏం మాట్లాడుకున్నారో'

హైదరాబాద్: రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విడిపోవడం తమకు సమ్మతమేనని చెప్పమని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కేసీఆర్ చెప్పారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఏపీకే లాభమని కేసీఆర్ నాడు తమకు చెప్పారని విభజనకు ముందు జరిగిన అంశాలను కొన్నింటిని తెలిపారు. విడిపోవడానికి మేము సమ్మతమేనని కేసీఆర్ చెప్పమన్నారు. అప్పుడు సిట్టింగ్ మొదలవుతుందని, కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి అవుతుందని చెప్పారని తెలిపారు.

YS Rajasekhar Reddy

తనకు వేరే ఆశలేమి తనకు లేవని, రాష్ట్ర విభజన ఒక్కటే తన ఆశ అని నాడు కేసీఆర్ చెప్పారని తెలిపారు. తాను కూడా కేసీఆర్‌తో ఏకీభవించి వెంటనే వైయస్ రాజశేఖరరెడ్డికి చెప్పానన్నారు. కేసీఆర్- వైయస్సార్ ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ఎంపీల వల్లే సాధ్యమైందని కూడా ఉండవల్లి చెప్పారు. 2009 తర్వాత కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయనను హైలైట్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా చెప్పారన్నారు. కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష ఏమిటో తమకు తెలుసని, కానీ తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుతుందనే తాము బయటపెట్టలేదని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారన్నారు.ో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+