• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి.. విమాన ప్రమాదం గుట్టును విప్పే పరికరాలేంటి..?

|
Google Oneindia TeluguNews

సాధారణంగా విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. ఇప్పటికే బ్లాక్ బాక్స్ అనేది ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టాయి. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకీ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి..? తాజాగా కేరళలోని కోజికోడ్ విమాన ప్రమాదంతో మరోసారి బ్లాక్ బాక్స్ వార్తల్లో నిలిచింది.

 విమాన ప్రమాదంలో కీలకంగా బ్లాక్ బాక్స్

విమాన ప్రమాదంలో కీలకంగా బ్లాక్ బాక్స్

బ్లాక్ బాక్స్ .. పేరులో బ్లాక్ ఉంది కదా అని ఇది నల్లరంగులో ఉంటుందనుకుంటే పొరపాటే. ఇది నారింజ రంగు (ఆరెంజ్ కలర్)లో ఉంటుంది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇందులో రికార్డు అవుతుంటాయి. అంటే ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు చేస్తారు. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లోనే ఎందుకుంటుందో అనేదాని వెనక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాదసమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్‌ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుంది.

 బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే ఎందుకు అమరుస్తారు..?

బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే ఎందుకు అమరుస్తారు..?

ఇక ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని డిజైన్ చేస్తారు. ఒకవేళ రేడార్ సిగ్నల్స్‌ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఇక బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఇక్కడే ఎందుకు అమరుస్తారంటే ఇది చాలా సురక్షితమైన చోటని నిపుణులు చెబుతున్నారు. అంటే విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వసం కాదు కాబట్టి ఇక్కడే బ్లాక్ బాక్స్‌ను అమరుస్తారు. అదే కాక్ పిట్ అయితే ఎక్కువగా ధ్వంసమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విమానంలో ఎంతో మంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి బ్లాక్ బాక్స్ తప్పనిసరిగా ప్రతి విమానంలోను ఉండాలనేది విమానాయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు.

 కీలకంగా రెండు పరికరాలు

కీలకంగా రెండు పరికరాలు

బ్లాక్ బాక్సులో రెండు కాంపొనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లయిట్ డేటా రికార్డర్ (FDR) రెండోది కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (CVR).FDR విమానంకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతుంది. అంటే ట్రాజెక్టరీ, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, వేగం, ఇంధనం ఎంత ఉంది, ఇంజిన్ థ్రస్ట్ లాంటి ముఖ్య పారామీటర్ల సమాచారం స్టోర్ చేస్తుంది ఎఫ్‌డీఆర్.అంతేకాదు విమానం ప్రతి కదలికను రికార్డు చేస్తుంది. అంతేకాదు ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు.. ల్యాండింగ్ గేర్‌ వేయడంలో జాప్యం జరిగిందా, లేదా పాక్షికంగా ధ్వంసమైందాలాంటి అంశాలను కూడా ఎఫ్‌డీఆర్ రికార్డు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్‌ కాక్‌పిట్‌లో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేస్తుంది. పైలట్ల సంభాషణ నుంచి ఏటీసీతో పైలట్ల సంభాషణ వరకు ప్రతిదీ రికార్డు అవుతుంది.

 ప్రమాదంకు ముందు అరగంట ఏం జరిగిందనేదే కీలకం

ప్రమాదంకు ముందు అరగంట ఏం జరిగిందనేదే కీలకం

ఇక పైలట్ ఎక్కడైనా సమస్య ఎదుర్కొన్నారా.. లేక విజిబులిటీ, లేదా వాతావరణ ఇబ్బందులను ఏటీసీకి తెలిపారా..? ప్రమాదం ముందు కాక్‌పిట్‌లో ఏంజరిగింది? వంటి కీలక విషయాలను సీవీఆర్ బయటపెడుతుంది. సీవీఆర్ అందించే నివేదిక ఆధారంగానే ఇది సాంకేతిక సమస్యతో విమాన ప్రమాదం జరిగిందా లేక మానవతప్పిదంతో ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు ధృవీకరిస్తారు. ఇవన్నీ ఒక మెటల్ బ్లాక్‌లోని మెమొరీ బోర్డుపై స్టోర్ అయి ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత దీన్ని వెలికి తీసి డీకోడ్ చేస్తారు. బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. అయితే క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదంకు ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం మాత్రమే విశ్లేషణకు పనికొస్తుంది.

English summary
Flight data recorders (FDR) store important data about a plane, which is often important in investigating air crashes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X