World Elephant Day 2021: ప్రకృతికి ఏనుగుల అవసరం ఎందుకు..? భారత్‌లో గజరాజుల పరిస్థితి ఏంటి..?

ఆగష్టు 10వ తేదీన ప్రపంచ సింహాల దినోత్సవం యావత్ దేశాలు ఘనంగా నిర్వహించాయి. ఇక ఆగష్టు 12వ తేదీ ప్రపంచ ఏనుగుల దినోత్సవంను ఆయా దేశాలు నిర్వహిస్తాయి. ఇక మనదేశం విషయానికొస్తే భారత్‌లో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని ఏనుగులను వాటి దంతాల కోసం మనిషి హతమారుస్తుంటే.. మరికొన్ని ఏనుగులు రైల్వే ట్రాకులు దాటుతూ ప్రమాదబారిన పడి మృతి చెందుతున్నాయి. ఇక ఈ మధ్యే అస్సాంలో పిడుగుపాటుకు గురై ఒక ఏనుగుల గుంపు మొత్తం మృత్యువాత పడింది. ఈ ఘటనలో 18 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులు ప్రకృతికి ఎందుకు అవసరం అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మనకు చక్కటి సమాధానం దొరుకుతుంది.

 ఆగష్టు 12వ తేదీ ప్రపంచ ఏనుగుల దినోత్సవం

ఆగష్టు 12వ తేదీ ప్రపంచ ఏనుగుల దినోత్సవం

ఇదంతా అటుంచితే ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏటా ఆగష్టు 12వ తేదీ నిర్వహిస్తారు. మన పర్యావరణంలో ఏనుగుల పాత్ర ఎంతగొప్పదో ఈ రోజున చర్చిస్తారు. అంతేకాదు గజరాజులను ఎలా సంరక్షించుకోవాలి ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవంను తొలిసారిగా 2012లో నిర్వహించారు. ఆసమయంలో ఆసియా మరియు ఆఫ్రికా జాతి ఏనుగులు ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చించడం జరిగింది. వీటికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న అంశాలపై చర్చించారు. వేటగాళ్లు స్మగ్లర్ల బారిన కొన్ని ఏనుగులు పడుతున్నాయని, కొన్ని జనావాసాల్లోకి వెళుతుండటంతో అక్కడి ప్రజలు వాటిని కొట్టి చంపేస్తున్నారని చెప్పారు. అంతేకాదు కొన్ని ఏనుగులను అడవిలో కాకుండి ఇళ్లల్లో కట్టి పెడుతున్నారనే విషయాలను గుర్తించడం జరిగింది.

 థాయ్‌లాండ్‌లో పుట్టిన ఏనుగుల దినోత్సవం

థాయ్‌లాండ్‌లో పుట్టిన ఏనుగుల దినోత్సవం

ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహణకు సంబంధించి ఒకసారి చరిత్రలోకి వెళితే పలు విషయాలు తెలుస్తాయి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరపాలని 2012 ఆగష్టు 12న బీజం వేశారు. ఆ సమయంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఎలిఫేంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ సంస్థ కెనడాకు చెందిన ఫిల్మ్‌మేకర్ పాట్రిసియా సిమ్స్‌తో జతకట్టింది. ఈ సంస్థ ఒక ఉద్యమమే నడిపింది. ఇక 2012 నుంచి సిమ్స్ ప్రపంచ ఏనుగుల దినోత్సవంను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక అప్పుడే వరల్డ్ ఎలిఫెంట్ సొసైటీ పుట్టుకొచ్చింది. దీనికి సిమ్స్ వ్యవస్థాపకురాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనుగుల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అవి ఎదుర్కొంటున్న కష్టాలు, వాటిని ఎలా సంరక్షించుకోవాలనేదానిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఏనుగుల కష్టాలకు చెక్

ఏనుగుల కష్టాలకు చెక్

ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రాధాన్యత ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం వెతికితే... అధికారిక వెబ్‌సైట్ పైనే దొరుకుతుంది. ఏనుగులను సంరక్షించేందుకు అవసరమైన సహాయం మద్దతు కోసమే ఆగష్టు 12వ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఏనుగులు వేటగాళ్ల బారిన పడి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నాయో వాటికి పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఏనుగులు మెరుగైన జీవనం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలకు పరిష్కారం కనుగొనడమే అంతిమ లక్ష్యంగా ఈరోజున పనిచేస్తారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవంకు సంబంధించి సిమ్స్ ఇలా అన్నారు."ప్రపంచ వ్యాప్తంగా ఏనుగుల దంతాల కోసం వాటిని చంపేస్తున్నారు. అయితే వీటిని అడ్డుకునేందుకు పలువురు జంతు ప్రేమికులు పలు సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. అలాంటి వారికి ప్రజలు మద్దతుగా నిలవాలి. ఏనుగులను సంరక్షించాలి. ఏనుగులకు ప్రత్యేకమైన శాంక్చురీలు ఏర్పాటు చేయాలి. అక్కడ అవి స్వేచ్ఛగా బతికేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.

ప్రకృతికి ఏనుగుల అవసరం ఎందుకు

ప్రకృతికి ఏనుగుల అవసరం ఎందుకు

ఇక భారతదేశంకు సంబంధించి ఇక్కడ జరిగే పండుగల్లో వేడుకల్లో ఏనుగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దేశ సాంస్కృతికి అంశాల్లో గజరాజులు కీలకంగా వ్యవహరిస్తాయి. ఊరేగింపులు, దేవుని ఉత్సవాల్లో ఎక్కువగా ఏనుగులు కనిపిస్తుంటాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని ఏనుగులపై తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇక ఉత్తర భారతం, పశ్చిమ భారతంలో ఉన్న పర్యాటక కేంద్రాల వద్ద ఏనుగులు కనిపిస్తాయి. అక్కడ ఇవి టూరిస్ట్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. భారత దేశంలోని కోటలు, రాజమహల్స్ వద్ద ఇవి కనిపిస్తాయి. ఓ వైపు ఈ ఏనుగులు పూజలందుకుంటూనే మరో వైపు వాటి దంతాల కోసం చంపబడుతున్నాయి. కొందరు దుర్మార్గులు మాత్రమే వీటిని చంపేస్తున్నారు. అయితే మూగజంతవులు సంరక్షణకు ఎన్ని చట్టాలున్నా స్మగ్లర్లకు ఇవేమీ పట్టడం లేదు. యదేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారు.ఏనుగులు పర్యావరణ ఇంజినీర్లుగా వ్యవహరిస్తాయి. అంటే ప్రకృతి ఆరోగ్యవంతంగా ఉండటంలో దోహదపడతాయి. ఏనుగులు తమ అవసరాల కోసం అంటే ఆహారం,నీరు కోసం గుంపులు గుంపులుగా సంచరిస్తాయి. ఈ క్రమంలో దట్టమైన అటవీ ఆవాసాలను తొక్కేస్తాయి.తద్వారా ఇతర అడవి జంతువులకు మార్గం సుగుమం చేస్తాయి. ఏనుగులు అక్కడక్కడ వేసే పేడలో విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు పెరిగి చెట్లుగా మారతాయి. తద్వారా అడవులు అంతంకాకుండా ఉంటాయి. దీని వల్ల వాతావరణంపై కూడా దుష్ప్రభావం పడదు. ఇక ఏనుగులు నీళ్లల్లో అడుగు పెట్టి నేలమీద అడుగు పెట్టగానే ఆ గజపాదం నుంచి వచ్చే నీరుతో భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు బతుకుతాయి. అందుకే ఏనుగులను సంరక్షిస్తే ఇతర జంతువులకు కూడా మేలు చేకూరుతుంది.

ఆసియా జాతి ఏనుగుల సంఖ్య

ఆసియా జాతి ఏనుగుల సంఖ్య

భారత్‌తో పాటు ఆగ్నేసియాలో ఉన్న ఆసియా జాతి ఏనుగులు సంఖ్య 50వేలకు దిగువకు పడిపోవడం ఆందోళన కలిగించే విషయమని జంతుప్రేమికులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏనుగుల దినోత్సవం 12 ఆగష్టున జరుపుకుంటుంటే.. మైసూరు జూ మాత్రం ఒకరోజు ముందే వేడుకలను నిర్వహించింది. ఏనుగులకు సంబంధించి కటౌట్లను జూ ముందు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఏనుగులపై పలు క్విజ్ కార్యక్రమాలను సైతం విద్యార్థులకు నిర్వహించారు.

ఇదిలా ఉంటే వరల్డ్ ఎలిఫెంట్ సొసైటీ అనే ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంద ఏనుగు సంరక్షణ సంస్థలతో కలిసి భాగస్వామిగా పనిచేస్తోంది.ప్రతి ఒక్కరూ ఈ మూగజీవాలను కాపాడేందుకు వారికి సామర్థ్యం మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+