Tirumala Express: తిరుమల ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కొత్త హాల్ట్ లు, టైమింగ్స్..!

విశాఖపట్నం-కడప మధ్య రాకపోకలు సాగిస్తున్న తిరుమల ఎక్స్ ప్రెస్ (Tirumala Express) ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రైలును మరిన్ని స్టేషన్లకు పొడిగించడంతో పాటు కొత్త స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చింది. అలాగే ఆయా స్టేషన్లలో తిరుమల ఎక్స్ ప్రెస్ ఏయే సమయాల్లో ఆగుతుందో కూడా వెల్లడించింది. ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా అధికారులు వెల్లడించారు.

Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

విశాఖపట్నం నుంచి కడప వరకూ ప్రయాణిస్తున్న తిరుమల ఎక్స్ ప్రెస్ ను ఇకపై గుంతకల్ వరకూ నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. కడపకు బదులు గుంతకల్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ 18522 మే 12 నుంచి అమల్లోకి రానుంది. అలాగే విశాఖపట్నం నుంచి గుంతకల్ కు వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ నంబర్ 18521 మార్పు మే13 నుంచి అమల్లోకి రానుంది. తిరుమల ఎక్స్ ప్రెస్ ఇకపై గుంతకల్-విశాఖ మధ్య ప్రతి రోజూ రాకపోకలు సాగించబోతోంది.

Tirumala Express Extended Visakhapatnam Kadapa Route Now Reaches Guntakal
జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్..! వీటినీ కలపాలని కోరిన చంద్రబాబు..!
జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్..! వీటినీ కలపాలని కోరిన చంద్రబాబు..!

తాజా మార్పు తర్వాత విశాఖపట్నం నుంచి బయలుదేరే తిరుమల ఎక్స్ ప్రెస్ కడపలో ఉదయం 7.03కు వస్తుంది. అక్కడి నుంచి యర్రగుంట్లలో 7.38కి, కొండాపురంలో 8.10కి, తాడిపత్రిలో 8.33కి, గుత్తిలో 9.13కు ఆగుతుంది. చివరిగా ఉదయం 111.30కు గుంతకల్ చేరుకుంటుంది. అలాగే గుంతకల్ లో మధ్యాహ్నం 1.30కు బయలుదేరే తిరుమల ఎక్స్ ప్రెస్ గుత్తిలో 1.55కు, తాడిపత్రిలో 2.50కి, కొండాపురంలో 3.13కి, యర్రగుంట్లలో 3.58కి, కడపలో 5.38కి ఆగుతుంది. ఇవి కాక మిగతా స్టేషన్లు, సమయాలు యథాతథంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+