తమిళనాడు గవర్నర్ కు స్టాలిన్ కీలక వినతి..! విజయ్ ఖరారవుతున్న వేళ..!
తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ ను కలిసిన విజయ్ కు నిరాశ ఎదురైంది. ఇవాళ మరోసారి గవర్నర్ వద్దకు వెళ్లి కమ్యూనిస్టులు, వీసీకే కూడా తనకు మద్దతిస్తున్నట్లు లేఖలు సమర్పించేందుకు విజయ్ సిద్ధమయ్యారు. అటు విజయ్ విఫలమైతే డీఎంకే-అన్నాడీఎంకే కూటమి కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం స్టాలిన్ (MK Stalin) కీలక ట్వీట్ చేశారు.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడి, అసెంబ్లీ రద్దయ్యాక కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ గవర్నర్ ను ఉద్దేశించి స్టాలిన్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని, ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ సభ్యుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసిందని తెలిపారు. ప్రస్తుత శాసనసభ ఇప్పటికే రద్దు అయిందని, గవర్నర్ ఆ మేరకు ప్రకటన కూడా జారీ చేశారని గుర్తుచేశారు.

தமிழ்நாடு சட்டமன்றத் தேர்தல் முடிவுகள் வெளியாகி, மக்களால் தேர்வு செய்யப்பட்ட சட்டமன்ற உறுப்பினர்களின் பட்டியலைத் தேர்தல் ஆணையம் வெளியிட்டு விட்டது. ஏற்கனவே இருந்த சட்டமன்றத்தையும் கலைத்து மாண்புமிகு ஆளுநர் அவர்கள் ஆணையும் பிறப்பித்து விட்டார். இப்படியொரு நிலையில், தேர்தலில் வென்ற…
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 8, 2026
ఇటువంటి పరిస్థితులలో, ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి, రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం కాలపు అవసరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం కూడా అని స్టాలిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో, ద్రవిడ మున్నేట్ర కజగం తరపున, ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి జాప్యం జరగకుండా నివారించడానికి, రాజ్యాంగం ప్రకారం ఒక కొత్త పరిపాలనను ఏర్పాటు చేయడానికి గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంకే స్టాలిన్ కోరారు. అయితే ఇవాళ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతిస్తారని భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications