డీఎంకే-అన్నాడీఎంకే కలిసినా విజయ్ కే ఛాన్స్..! కీలక సమీకరణాలు ఇవే..!

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ గంట గంటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఓవైపు 118 సీట్ల మెజార్టీ లేదనే కారణంతో టీవీకే అధినేత విజయ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వకుండా గవర్నర్ అడ్డుపడుతుంటే.. మరోవైపు డీఎంకే-అన్నాడీఎంకే కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. అవసరమైతే బీజేపీకి గుడ్ బై చెప్పేసి మరీ డీఎంకేతో చేతులు కలిపి అధికారం పొందేందుకు అన్నాడీఎంకే పావులు కదుపుతోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఎదురవుతోంది.

డీఎంకే, అన్నాడీఎంకే (dmk and aiadmk) రెండు పార్టీలు కలిసినా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు లభించిన సీట్లు కలిపితే 118 సీట్ల మెజార్టీ మార్కు రాదు. డీఎంకేకు 59, అన్నాడీఎంకేకు 47 సీట్లు ఉన్నాయి. ఈ రెండూ కలిసినా 106 సీట్లు మాత్రమే అవుతాయి. వీరికన్నా విజయ్ టీవీకే ఒక్క సీటు ఎక్కువగా 107 సీట్లు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లోని చిన్న పార్టీలే ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారబోతున్నాయి.

Despite Alliance DMK and AIADMK Fall Short Against Vijay Smaller Parties Prove Decisive in Tamil Nadu

ప్రస్తుతం డీఎంకే కూటమిలోని సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, వీసీకేలకు తలో రెండు సీట్లు ఉన్నాయి. అలాగే డీఎండీకేకు ఒక సీటు ఉంది. అలాగే అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకేకు 4, ఏఎంఎంకే, బీజేపీకి తలో సీటు ఉన్నాయి. ఇందులో పీఎంకే ఉంటే వీసీకే, సీపీఐ, సీపీఎం కలవవు. అలాగే వీసీకే ఉన్న కూటమిలో బీజేపీ, పీఎంకే కలవవు. అలాగే అన్నాడీఎంకే బీజేపీని వదులుకున్నా పీఎంకేను వదులుకోదు. కాబట్టి ప్రస్తుతం డీఎంకే కూటమిలోని సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ తమ 8 సీట్ల మద్దతు విజయ్ కు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. దీంతో విజయ్ కు మాత్రమే తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+