ఇదసలు గెలుపే కాదు..? ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారంలోకి రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు విషయం కాదు. కానీ దాన్ని చేసి చూపించారు విజయ్. విజయ్ టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 107 స్థానాల్లో విజయం సాధించింది. అధికార డీఎంకే 74 స్థానాలకు పరిమితం అయింది. అన్నాడీఎంకే 53 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే తమిళనాడు ఫలితాలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు.

తమిళనాట చరిత్రలో కామరాజు ఓడిపోయారు.. స్టాలిన్ ఓడిపోయారు అని ప్రకాశ్ రాజ్ అన్నారు. సమాజం అంటే కేవలం అభిమానుల మయం అయిపోయిందని పేర్కొన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన సమాజం మారలేదనడానికి ఈ ఫలితాలే ఒక నిదర్శనం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అలాగే రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షంలోనే అని తెలిపారు. మన ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం.. విజేతలకు, వారు చేయబోయే ప్రజా సేవకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని ప్రకాశ్ రాజ్ కీలక ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

PrakashRaj Posts Key Tweet Tamil Nadu Election Results Sparks Major Political Reactions PrakashRaj

అయితే ప్రకాశ్ రాజ్ ఏ పార్టీని పొగిడారు.. ఏ పార్టీని విమర్శించారో అర్థం కావడంలేదు.. ఓటేసిన ప్రజల్నే ఆయన తనదైన శైలిలో ప్రశ్నించినట్లు స్పష్టం అవుతోంది. ఇక తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగురవేశారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ లో ఈ మేరకు విక్టరీ కొట్టారు. ఇక తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ఓటమి పాలయ్యారు.

కొలత్తూర్ నియోజకవర్గంలో గత మూడు సార్లు విజయం సాధించిన స్టాలిన్ ఈ సారి టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే 1996 తర్వాత స్టాలిన్ తొలిసారి ఓడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఎడప్పాడిలో 90 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+