గుత్తి వంకాయ నిల్వ పచ్చడి: వేడి అన్నంలో తింటే అద్భుతః!

గుత్తి వంకాయతో కూర, స్టఫ్ చేసిన గుత్తి వంకాయ ఇలా రకరకాల కూరలు వండుతూ ఉంటాం . అయితే గుత్తి వంకాయ నిల్వ పచ్చడి మీరు ఎప్పుడైనా చేశారా? చెయ్యకపోతే తప్పకుండా చెయ్యండి. ఈ పచ్చడి చాలా టేస్టీ గా ఉంటుంది. అలాగే ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది. మరి గుత్తి వంకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం.

గుత్తి వంకాయ నిల్వ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

వంకాయలు: అర కిలో (చిన్న సైజు లేత గుత్తి వంకాయలు)

చింతపండు: 100 గ్రాములు (గుజ్జు తీసి ఉడికించుకోవాలి)

కారం: 100 గ్రాములు (రుచికి తగినట్లు)

ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 80-100 గ్రాములు)

మెంతి పొడి: 1 టీస్పూన్

ఆవపొడి: 2 టీస్పూన్లు

నూనె: 250 గ్రాములు (వేరుశనగ నూనె అయితే రుచి బాగుంటుంది)

పోపు కోసం: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ.

Gutti Vankaya Nilva Pachadi Recipe know the making process of gutti vankaya nilva pachadi for taste

తయారీ విధానం

ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడవాలి. వంకాయలకి మధ్యలో ప్లస్ ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక, ఈ గుత్తి వంకాయలను వేసి మగ్గే వరకు (మెత్తబడే వరకు) వేయించి పక్కన పెట్టుకోవాలి

పచ్చడికి ప్రధానంగా చెయ్యాల్సింది ఇదే

ఆపై అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి చింతపండు గుజ్జును పోసి బాణలిలో వేసి దగ్గరపడి నూనె తేలే వరకు ఉడికించాలి.ఒక గిన్నెలో కారం, ఉప్పు, ఆవపొడి, మెంతి పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన వంకాయల్లోకి స్టఫ్ చేయాలి. మిగిలిన మసాలా పొడిని ఉడికించిన చింతపండు గుజ్జులో వేసి కలపాలి. అందులోనే స్టఫ్ చేసిన వంకాయలను కూడా వేసి జాగ్రత్తగా కలపాలి.

నిమ్మరసం ఖాళీ కడుపుతో తాగుతున్నారా? అయితే ఈ హెచ్చరిక!
నిమ్మరసం ఖాళీ కడుపుతో తాగుతున్నారా? అయితే ఈ హెచ్చరిక!

పచ్చడి నిల్వ ఉండాలంటే ఇలా చెయ్యాలి

ఈ గుత్తి వంకాయ నిల్వ పచ్చడి కోసం బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేయాలి. ఈ పచ్చడికి తడి తగలకూడదు: పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వంకాయలు తడి లేకుండా చూసుకోవాలి.. ఈ పచ్చడిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే 3 నుండి 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. పచ్చడి పైన నూనె తేలుతూ ఉంటే బూజు రాకుండా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+