నిద్రలో గురక వస్తోందా.. జాగ్రత్త, కంట్రోల్ అవ్వాలంటే..!!

కంటి నిండా నిద్ర పోవటం ప్రస్తుత కాలం కష్టంగా మారుతోంది. అన్ని వయసుల వారిని నిద్ర లేమి వేధిస్తోంది. సరైన నిద్ర లేకపోవటం తో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, నిద్ర పోయే సమయంలో కొందరు గురక తో భయ పెడతారు. ఈ గురక రావటం వెనుక పలు రకాల కారణాలు ఉన్నాయి. ఈ గురకతో ఆరోగ్య పరమైన ప్రమాదాలు ఉన్నాయని చెబుతారు. అయితే, నిత్యం ఈ గురక రాకుండా జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. నిద్ర ఎంత అవసరమో.. ఈ గురక అంత మంచిది కాదనే హెచ్చరికలు ఉన్నాయి. దీంతో.. గురక నివారణకు మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు.

గురక కేవలం నిద్రలో వచ్చే శబ్దం కాదని.. శరీర అంతర్గత సమస్యలకు హెచ్చరిక అంటూ పలువురు వైద్యులు చెబుతున్నారు. శ్వాస మార్గాల్లో అడ్డంకుల వల్ల నిద్ర నాణ్యత దెబ్బతిని రక్తపోటు, గుండెపోటు వంటి ముప్పులు పెరుగుతాయి. జీవనశైలి మార్పులు, బరువు తగ్గడం, స్లీప్ స్టడీ ద్వారా దీనిని ప్రాథమిక దశలోనే నియంత్రించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. నిద్ర పోతున్న సమయంలో ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడిన సమయంలో గురక వస్తుంది. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండటం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడి గురకకు దారితీస్తుంది. మద్యం సేవించడం, సిగరెట్‌ స్మోకింగ్‌, ట్రాంక్విలైజర్‌ ఔషధాల వాడకంతో కూడా గురక వస్తుంది.

 బెంగాల్ సీఎం సువేందు సంచలన నిర్ణయం, మమతా బెనర్జీ 'ఫిక్స్'..!!
బెంగాల్ సీఎం సువేందు సంచలన నిర్ణయం, మమతా బెనర్జీ 'ఫిక్స్'..!!
snoring-the-most-common-causes-of-loud-snoring-include-obesity-nasal-congestion-alcohol-use-and

గురక నివారణ చిట్కాలు

గురక రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధాన కార‌ణంగా మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పరిశోధకులు నిర్ధారించారు. గురకపెట్టకుండా ఉండాలంటే వాయుమార్గం తెరుచుకుని ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వెల్లకిలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది. అందుకని పక్కకు తిరిగి పడుకోవాలి. పడుకునేటప్పుడు తల భాగం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. పడక గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రపోయే ముందు మద్యం సేవించే అలవాటును పూర్తిగా మానుకోవాలి. శరీరం బరువు పెరగడం వల్ల గడ్డం ప్రాంతంలో కొవ్వు కణజాలం పెరుకుపోయి కూడా గురక వస్తుంది. అందుకని శరీరం బరువు తగ్గించుకోవాలి. యోగా, ప్రాణాయామం అలవాటు చేసుకోవడం వల్ల శ్వాసపై నియంత్రణ పెరిగి గురక తగ్గుతుంది. గురక సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుల సలహాలను పాటించటం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+