అయ్యో.. డెలివరీ బాయ్ గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో వైరల్..
టాలీవుడ్ లో చాలామంది యంగ్ హీరోలు పలు క్రేజీ మూవీస్ తో దూసుకెళ్తున్నారు. మరికొంత మంది హిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నందు. 2006 లో ఫోటో సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 100 పర్సెంట్ లవ్, ఆటోనగర్ సూర్య, పాఠశాల, ఐస్ క్రీమ్ 2, పెసరట్టు, పెళ్లిచూపులు, సవారీ, సైక్ సిద్ధార్థ తదితర సినిమాలతో మెప్పించాడు. ఇటీవల వధువు అనే వెబ్ సిరీస్ లోనూ ఆయన నటించాడు. అయితే చాలా సినిమాల్లో ఆయనకు నిరాశే మిగిలింది. ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలం అయ్యాడు.

ఇక తాజాగా నందు నటిస్తున్న సినిమా అగ్లీస్టోరీ.. ఈ మూవీలో హీరోయిన్ గా చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. రియా జియా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి లక్కీ మీడియా బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మే 22న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక అగ్లీస్టోరీ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి.
.@actorshreenandu spotted on a Blinkit bike promoting his upcoming film in style 🛵
— Rajesh Manne (@rajeshmanne1) May 11, 2026
#UglyStoryOnMay22nd #UglyStory pic.twitter.com/xT9KyNyXQB
అయితే ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా యంగ్ హీరో నందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమాను డిఫెరెంట్ గా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. బ్లింకిట్ గ్రాసరీ బ్యాగ్ ను మెడకు వేసుకుని హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. ఇది చూసిన కొందరు కుర్రాళ్లు నందూ డెలివరీ చేస్తున్నావా.. ?అని అడగ్గా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు కనిపించిన వారికి సినిమా పాంప్లేట్స్ పంచుతూ సందడి చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications