37 వేల కోట్లతో కేంద్రం కొత్త పథకం, రైతన్నలకు భారీ గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు మేలు చేకూర్చేలా కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను (MSP) పెంచుతూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాగు ఖర్చుకు అదనంగా కనీసం 50 శాతం లాభం కలిపి ఈ ధరలను ఖరారు చేశారు. ఈ మద్దతు ధరల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2.60 లక్షల కోట్లను కేటాయించింది.

ఈ పెంపులో భాగంగా వరి క్వింటాకు రూ. 2,441 గా నిర్ణయించగా, గ్రేడ్-A రకం వరి ధరను రూ. 2,461 కు పెంచారు. జొన్నలు (హైబ్రిడ్) క్వింటాకు రూ. 4,023, జొన్నలు (మల్దండి) ధర రూ. 4,073 గా ఉండనుంది. అన్నిటికంటే ఎక్కువగా సన్ ఫ్లవర్ గింజలకు క్వింటాకు రూ. 622, పత్తికి రూ. 557 చొప్పున భారీగా మద్దతు ధరను పెంచారు. పెట్టుబడిపై లాభం విషయంలో పెసర సాగుకు అత్యధికంగా 61 శాతం మేర మార్జిన్ లభించనుంది.

మరిన్ని నిర్ణయాలు..

  • సజ్జల కనీస మద్దతు ధర రూ.2,900 ఉంటుందన్నారు.
  • కందుల కనీస మద్దతు ధర రూ.8,415గా నిర్ణయం
  • పెసలు ధర రూ.8,780
  • మినుములు రూ.8,200
  • పత్తి(మధ్యశ్రేణి) ధర రూ.8,267
  • పత్తి(దీర్ఘశ్రేణి) ధర రూ.8,667
  • వేరుశెనగ ధర రూ.7,517
  • ప్రొద్దుతిరుగుడు విత్తనాల కనీస మద్దతు ధర రూ.8,343
  • సోయాబీన్ (ఎల్లో) ధర రూ.5,708
  • నువ్వుల కనీస మద్దతు ధర రూ.10,346
  • నైజర్‌ విత్తనాల ధర రూ.10,052
  • సర్ఖేజ్‌-ధొలేరా సెమీ హైస్పీడ్‌ డబుల్‌ లైన్‌కు రూ.20,667 కోట్ల కేటాయింపు
  • నాగ్‌పుర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతీకరణకు నిర్ణయం.
Union Cabinet Boosts Agri and Infrastructure Paddy MSP Raised to 2 441 Rupees and New Road Corridors Approved

బొగ్గు గ్యాసిఫికేషన్: ఇంధన రంగంలో సరికొత్త విప్లవం

దేశాన్ని ఇంధన రంగంలో 'ఆత్మనిర్భర్'గా మార్చే దిశగా రూ. 37,500 కోట్ల వ్యయంతో 'బొగ్గు గ్యాసిఫికేషన్' (Coal Gasification) పథకానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. భారత్ వద్ద రాబోయే 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఆ బొగ్గు ద్వారా గ్యాస్, యూరియా, విద్యుత్, వివిధ రసాయనాలను ఉత్పత్తి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, కర్బన ఉద్గారాలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.

ఏడాది పాటు గోల్డ్ కొనకపోతే దేశానికి ఏమవుతుంది? మోదీ మాస్టర్ ప్లాన్!
ఏడాది పాటు గోల్డ్ కొనకపోతే దేశానికి ఏమవుతుంది? మోదీ మాస్టర్ ప్లాన్!

బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు.. కనెక్టివిటీకి పెద్దపీట

ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మే 13, 2026 నుండి అమలులోకి వచ్చేలా బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6% నుండి 15%కి పెంచింది. ఇందులో 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మరియు 5% అగ్రికల్చర్ సెస్ (AIDC) ఉన్నాయి.

దేశ ప్రజలకు విజ్ఞప్తి! పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక ప్రకటన
దేశ ప్రజలకు విజ్ఞప్తి! పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక ప్రకటన

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, గుజరాత్ లోని సర్ఖేజ్-ధోలెరా డబుల్-లేన్ కారిడార్ అభివృద్ధి కోసం రూ. 20,665 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది ఆయా ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి భారీగా ఊతమివ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+