చంచల్‌గూడ జైల్‌లో 'ఫీల్ ది జైల్' .. రూ.500కు ఒకరోజు ఖైదీ జీవితం!

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్య ప్రజలు జైలు జీవితం ఎలా ఉంటుందో నేరుగా అనుభవించేలా 'ఫీల్ ది జైల్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో భాగంగా జైలు చరిత్రను ప్రదర్శించే 'జైల్ మ్యూజియం'ను కూడా ప్రారంభించారు.

చంచల్ గూడా జైల్లో ఫీల్ ది జైల్

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జైలు మ్యూజియంలో ఉన్న వస్తువులు మరియు 'ఫీల్ ది జైల్' కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యారక్‌లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమం ద్వారా సామాన్యులు, ముఖ్యంగా యువత నేరాల ప్రమాదాలను అర్థం చేసుకుని, తప్పులు చేయకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు తీసుకువచ్చారు.

Chanchalguda Central Jail has launched a unique initiative Feel the Jail where people can experience one day of real prison life

నాలుగుగోడల మధ్య స్వేచ్ఛ లేని జైలు జీవితం

క్షణికావేశంలో చేసిన చిన్న తప్పు కూడా జీవితాన్ని ఎలా మార్చేస్తుందో, నాలుగుగోడల మధ్య స్వేచ్ఛ లేని జైలు జీవితం ఎంత కష్టమో ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని అధికారులు దీనిని ఏర్పాటు చేసారు. ఎవరైనా రూ.500ఫీజు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఖైదీలు ధరించే యూనిఫామ్ ధరించి, జైలు బ్యారక్‌లోనే ఒకరోజు గడపాలి. జైలు నిబంధనల ప్రకారం అందించే భోజనం తినాలి. జైలు రోజువారీ దినచర్యను పూర్తిగా అనుభవించాలి.

చంచల్‌గూడ జైలు ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం

చంచల్‌గూడ జైలు ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో నిజాం కాలం నాటి చరిత్ర, పాత సంకెళ్లు, ఉరి తాడు, ఆయుధాలు, పాత రికార్డులు, ఫోటోలు వంటి అనేక వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. ఇది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ ప్రయత్నం ద్వారా సమాజంలో నేరాలు తగ్గించడం, యువతలో అవగాహన పెంచడం లక్ష్యంగా తెలంగాణ జైళ్ల శాఖ పని చేస్తోంది.

హైదరాబాద్ లో మరో ఎలివేటెడ్ ఫ్లైఓవర్.. ఈ రూట్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్!
హైదరాబాద్ లో మరో ఎలివేటెడ్ ఫ్లైఓవర్.. ఈ రూట్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్!

జైలు జీవితం గురించి సానుకూల మార్పు

జైలు జీవితం గురించి కేవలం ఊహలు కాకుండా నిజమైన అనుభవం కల్పించడం ద్వారా ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురావాలని అధికారులు ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జైళ్లలో కూడా విస్తరించే అవకాశం ఉంది. జైలు జీవితం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక ప్రత్యేక అవకాశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+