పాక్ విషయంలో చైనాకు భారత్ సీరియస్ వార్నింగ్..! సిందూర్ లో సపోర్ట్ పై..!

గతేడాది ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ కు చైనా అందించిన మద్దతుపై భారత్ ఇవాళ మరోసారి తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక వసతులను కాపాడేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు దాని 'ప్రతిష్ట, స్థాయి'పై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష మద్దతు ఇచ్చిందని ఇటీవల అంగీకరించిన నేపథ్యంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ అంశంపై నివేదికలు గతంలో తెలిసిన వాటిని ధృవీకరించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను రక్షించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వల్ల తమ ప్రతిష్ట, స్థాయి ఎలా ప్రభావితమవుతుందో బాధ్యతాయుతమైన దేశాలు ఆలోచించుకోవాలని జైస్వాల్ సూచించారు. ఆపరేషన్ సింధూర్ గతేడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడికి ఒక "ఖచ్చితమైన, క్రమబద్ధమైన" ప్రతిస్పందన అని ఆయన తెలిపారు. పాకిస్తాన్ నుండి దాని ఆదేశాల మేరకు పనిచేస్తున్న ప్రభుత్వ-ప్రోత్సహక ఉగ్రవాద మౌలిక వసతులను ధ్వంసం చేయడమే దీని లక్ష్యం అన్నారు.

Operation Sindoor India Responds to China s Technical Support to Pakistan MEA s Full Statement

ఈ సంఘర్షణలో చైనా చురుకైన పాత్రను జూలై 4న లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ మొదటిసారి వెల్లడించారు. DGMO-స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు, చైనా నుండి మన సైనిక విస్తరణపై పాకిస్తాన్‌కు ప్రత్యక్ష సమాచారం అందింది. కాబట్టి మనం త్వరగా స్పందించి తగిన చర్య తీసుకోవాలని ఆయన కోరారు. ఈ యుద్దంలో టర్కీ కూడా పాలుపంచుకుందని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ వెల్లడించారు. అది పాకిస్తాన్‌కు బాయ్రాక్టర్ డ్రోన్‌లను సరఫరా చేసింది. గత వారం సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా ఇంజనీర్లు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ తో కలిసి పనిచేసినట్లు అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+