హ్యాట్సాఫ్ విజయ్: హీరో విశాల్ సంచలన ట్వీట్
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రెండో రోజే విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలతోపాటు పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు 500 మీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలను గుర్తించి వచ్చే రెండు వారాల్లోగా పూర్తిగా మూసివేయాలని ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.

విద్యాసంస్థలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉన్న నేపథ్యంలో అవి విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతోందని చాలా కాలంగా మహిళా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు బస్టాండ్ల సమీపంలో మద్యం దుకాణాలు కారణంగా మహిళలు, ప్రయాణికులు అసౌకర్యంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్వాగతిస్తున్నారు. అటు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కూడా స్వాగతిస్తున్నారు.
Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB
— Vishal (@VishalKOfficial) May 12, 2026
ఇదే సమయంలో తమిళ ప్రముఖ నటుడు, విజయ్ స్నేహితుడు విశాల్ తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఎక్స్ లో కీలక పోస్టు పెట్టారు. సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఏమిటీ మార్పు.. విజయ్ మీకు హ్యాట్సాఫ్.. ముఖ్యంగా పాఠశాలల సమీపంలోని మద్యం దుకాణాలను తొలగించడం ద్వారా ఎంతోమంది పోకిరీలు ఆడపిల్లలను వేధించడం తగ్గిపోతుంది.. అని ఆయన పేర్కొన్నారు. ఇక తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 108 స్థానాల్లో విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ తర్వాత మిత్రపక్షాల మద్దతులో విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications