'బాహుబలి'లో రానా భార్య ఎవరో తెలిసిపోయిందోచ్..!
తెలుగు చిత్ర పరిశ్రమను "బాహుబలి" చిత్రానికి ముందు.. ఆ తర్వాత అంటూ వర్ణించడంలో అసలు తప్పే లేదు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన ఈ మూవీ భారతీయ సినిచరిత్రలో ప్రభంజనం సృష్టించింది. 2015లో 'బాహుబలి: ది బిగినింగ్', 2017లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్' పేర్లతో విడుదలై భారీ వసూళ్లను రాబట్టి కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాకుండా రికార్డులు తిరగరసింది. బాహుబలి: ది కన్‌క్లూజన్' ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి భారతీయ సినిమా చరిత్రలో టాప్ కేటగిరీలో నిలిచింది.
దర్శకధీరుడు S. S. Rajamouli తన అసాధారణమైన విజన్, అద్భుతమైన కథనంతో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. అప్పటివరకు తెలుగు సినిమా అంటే కేవలం ప్రాంతీయ స్థాయిలోనే భావించిన చాలామందికి 'బాహుబలి' ఒక గట్టి సమాధానం ఇచ్చింది. భారీ సెట్లు, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో నిండిన కథ, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

పాన్ ఇండియా ట్రెండ్‌కు శ్రీకారం..
'బాహుబలి' విడుదలకు ముందు ఒక ప్రాంతీయ సినిమా దేశవ్యాప్తంగా ఇంతటి స్థాయిలో సంచలనం సృష్టించడం చాలా అరుదు. తెలుగు సినిమా మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడమే కాకుండా, తర్వాత వచ్చిన పాన్ ఇండియా సినిమాలకు కూడా 'బాహుబలి' మార్గదర్శకంగా నిలిచింది. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపించింది. మహిష్మతి రాజ్యం, యుద్ధ సన్నివేశాలు, రాజభవనాలు, జలపాతాలు అన్నీ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. ముఖ్యంగా ఎంఎం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు మరింత ప్రాణం పోసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
ప్రభాస్ కెరీర్‌ను మార్చేసిన చిత్రం..
ఈ సినిమాలో Prabhas చేసిన అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచాయి. ప్రభాస్ కేవలం నటించలేదు, ఆ పాత్రల్లో జీవించాడనే చెప్పాలి. బాహుబలి తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉత్తరాదిలో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ అసాధారణం. 'సాహో' వంటి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, హిందీలో భారీ వసూళ్లు సాధించడం వెనుక 'బాహుబలి' ప్రభావమే ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
భళ్లాలదేవుడిగా రానా విధ్వంసం..
హీరోకి ఎంతటి పేరు వచ్చిందో, విలన్ పాత్రకు కూడా అంతే స్థాయిలో ఆదరణ లభించింది. Rana Daggubati భళ్లాలదేవుడిగా చూపించిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. హీరోగా ఎన్నో సినిమాలు చేసినా, రానాకు వచ్చిన అసలైన గుర్తింపు ఈ నెగెటివ్ రోల్ ద్వారానే వచ్చింది. అతని క్రూరత్వం, శరీర భాష, డైలాగ్ డెలివరీ అన్నీ భళ్లాలదేవుడు పాత్రను అమరంగా నిలిపాయి. ప్రభాస్‌కు సమానంగా స్క్రీన్ ప్రెజెన్స్ చూపించిన రానా, ప్రతి సన్నివేశంలో తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టాడు.
11 ఏళ్ల తర్వాత కూడా వెంటాడుతున్న మిస్టరీ
'బాహుబలి' విడుదలై పదకొండు సంవత్సరాలు గడిచినా, అభిమానులను వెంటాడుతున్న కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ ఉన్నాయి. అందులో ప్రధానమైనది "భళ్లాలదేవుడి భార్య ఎవరు?" అనే సందేహం. సినిమాలో భళ్లాలదేవుడి కుమారుడు భద్ర కనిపించినప్పటికీ, అతని తల్లి ఎవరు అనే విషయాన్ని ఎక్కడా స్పష్టంగా చూపించలేదు. ఈ విషయంపై ఒకసారి టీవీ షోలో నటుడు Adivi Sesh ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్ర పాత్రలో నటించిన ఆయనను ఈ ప్రశ్న అడగగా, తాను కూడా ఇదే విషయాన్ని రాజమౌళిని అడిగానని చెప్పారు. దానికి రాజమౌళి నవ్వుతూ, "భళ్లాలదేవుడు ఒక దుర్మార్గుడు. అలాంటి వ్యక్తి ఎవర్నైనా ఏదైనా చేసి ఉండొచ్చు... అలా నువ్వు పుట్టావు" అని చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ఎన్నేళ్లుగా అభిమానులను వెంటాడుతున్న ప్రశ్నకు ఓ క్లారిటీ వచ్చినట్టైంది.












Click it and Unblock the Notifications