AIADMK ఆఫీసుకు విజయ్- బలపరీక్ష వేళ రెబెల్స్ తో..!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో అన్నాడీఎంకేలో చీలిక (AIADMK) ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని వ్యతిరేకిస్తూ 30 మంది రెబెల్ ఎమ్మెల్యేలు గళం విప్పారు. సీఎం విజయ్ (Vijay)కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. రేపు అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు ముందు వీరంతా కీలకంగా మారారు. దీంతో సీఎం విజయ్ ఇవాళ అన్నాడీఎంకే రెబెల్ నేత షణ్ముగం ఆఫీసుకు వెళ్లారు. అక్కడ రెబెల్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు

విజయ్ రాకపై స్టాలిన్ ట్వీట్..! ఆ సలహా ఇచ్చా..!
విజయ్ రాకపై స్టాలిన్ ట్వీట్..! ఆ సలహా ఇచ్చా..!

అన్నాడీఎంకే రెబెల్ వర్గాన్ని నడిపిస్తున్న కీలక నేతలు ఎస్పీ వేలుమణి, సి.వి.షణ్ముగంలతో సీఎం విజయ్ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. దీంతో రెబెల్ వర్గం మద్దతు పొందడంలో విజయ్ సక్సెస్ అయినట్లే అని తెలుస్తోంది. రేపు ఈ 30 మంది రెబెల్స్ మద్దతు ఇస్తే బలపరీక్ష విజయ్ కు నల్లేరుపై నడకే అవుతుంది. ఈ నేపథ్యంలో బలపరీక్ష సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై విజయ్ వారితో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రెబెల్స్ తీరుపై ఆగ్రహంగా ఉంది.

Tamil Nadu Floor Test 2026 CM Vijay Meets Rebel AIADMK Leaders Backing TVK Full Details
Vijay-Udayanidhi: ఉదయనిధికి విజయ్ రిటర్న్ గిఫ్ట్..! అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..!
Vijay-Udayanidhi: ఉదయనిధికి విజయ్ రిటర్న్ గిఫ్ట్..! అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..!

ఇప్పటికే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు సందర్బంగా ప్రతిష్టంభన నెలకున్న సమయంలో ఆయనకు అండగా నిలవాలని అధిష్టానంపై రెబెల్స్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే అటు అధిష్టానం కానీ, ఇటు విజయ్ కానీ అందుకు అంగీకరించలేదు. దీంతో మౌనంగా ఉండిపోయిన వీరంతా ఇప్పుడు బలపరీక్షకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఇవాళ సీఎం విజయ్ కు చెప్పారు. అయితే రేపు బలపరీక్షలో ఓటేసిన తర్వాత ఈ రెబెల్స్ ను అన్నాడీఎంకే బహిష్కరిస్తే ఏం చేయాలన్న దానిపైనా వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే చీలిక వర్గంగా ముందే స్పీకర్ వీరిని గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+