అలా విశాఖపట్నంలో.. బాబులకే బాబు వచ్చేస్తున్నాడుగా !!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈ చిత్ర బృందం ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్ గానే హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ తో పాటు, వారణాసిలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమా తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకున్నట్లు తెలిసింది. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తన టెక్నికల్ టీంతో కలిసి వైజాగ్ లో ల్యాండ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొనబోతున్నారని అంటున్నారు. ఆయనపై కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీతో రాజమౌళి ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో అని చర్చ నడుస్తోంది.
మరోవైపు ఈ మూవీలో మహేష్ చిన్ననాటి పాత్రలో భార్గవ్ రామ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ముద్దులొలికే ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. భార్గవ్ బాలనటుడిగా తెరంగేట్రం చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌కు రాజమౌళి, మహేష్‌తో బలమైన అనుబంధం ఉంది. రాజమౌళి కెరీర్ 'స్టూడెంట్ నెం.1'తోనే ప్రారంభమైనందున ఎన్టీఆర్‌తో ఆయనకు విడదీయరాని స్నేహం ఉంది. మహేష్, ఎన్టీఆర్ కూడా ఒకరినొకరు సోదరుల్లా భావిస్తారు. ఈ అనుబంధాల కారణంగా ఇప్పుడు భార్గవ్ రామ్ కూడా ఇందులో భాగమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications