తమిళనాడులో బీజేపీకి వరుస షాక్ లు..! కస్తూరి బాటలోనే ఖుష్బూ..!
తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా కేంద్రం చెప్పుచేతల్లో ఉన్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అడ్డుపడుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ రెండుసార్లు గవర్నర్ ను కలిసి తమకు ఉన్న మెజార్టీ మేరకు ఎమ్మెల్యేల జాబితాను సమర్పించినా ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఆహ్వానించకపోవడంతో రాష్ట్రంలో అందరూ ఏకమవుతున్నారు.
విజయ్ తో తమ మిత్రపక్షం కాంగ్రెస్ జట్టు కట్టిన తర్వాత కూడా డీఎంకే అధినేత స్టాలిన్ ఆయనకు అండగానే నిలిచారు. బీజేపీకి (BJP) అవకాశం ఇవ్వకుండా విజయ్ ముఖ్యమంత్రి కావడానికి తాము అడ్డుపడబోమని తేల్చిచెప్పేశారు. దీంతో తమిళనాడులో ఇతర పార్టీలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇదే క్రమంలో బీజేపీలో ఉన్న తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు సైతం తమ సహచరుడు విజయ్ కు అండగా నిలుస్తున్నారు. దీంతో బీజేపీకి వరుస షాకులు తప్పడం లేదు.

As a citizen of Tamilnadu State, when people have chosen their CM, he should lead. @actorvijay#TVKVijayHQ
— KhushbuSundar (@khushsundar) May 7, 2026
People of Tamilnadu have voted overwhelmingly for Vijay. TVK is the largest party , governor is duty bound to invite them to form government and prove majority in floor test. Any delaying tactics will be seen as sabotage by the people of TamilNadu and beyond. And they will blame…
— Kasturi (@KasthuriShankar) May 7, 2026
ముఖ్యమంత్రిగా విజయ్ ను నియమించకుండా గవర్నర్ కాలయాపన చేయడం ద్వారా బీజేపీ కుట్ర చేస్తున్నట్లు, నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు సంకేతాలు వెళ్తున్నాయని మధ్యాహ్నం ఆ పార్టీ నేత కస్తూరి ట్వీట్ చేశారు. విజయ్ కు ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో మరో సీనియర్ నటి, బీజేపీ నేత కుష్బూ కూడా చేరిపోయారు. తమిళనాడు పౌరురాలిగా ప్రజలు కోరుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాల్సిదేనంటూ విజయ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications