'సింగ్ గీతం' వేరే లెవెల్ మూవీ.. 94 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి

లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఫాంటసీ కామెడీ మ్యూజికల్‌ ఫిల్మ్‌ 'సింగ్ గీతం'.. 94 ఏళ్ల వయసులోనూ గొప్ప విజన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 12 న విడుదలైంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మాటల్లేకుండా అప్పట్లోనే 'పుష్పక విమానం' సినిమా చేసిన ఆయన, మాటే పాట అయితే అంటూ మరో కొత్త ప్రయోగానికి తెర లేపుతూ చేసిన ప్రయత్నమే ఈ సినిమా..

సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రం ద్వారా పర్యావరణం గొప్ప తనాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. పచ్చని చెట్టు బంగారం కంటే మిన్న అనే సందేశం ఈ చిత్రం ద్వారా ఆయన నేటి జనరేషన్ కు అందించారు. ఇక సింగీతం విజన్‌ ను, తెరపైకి తెచ్చేందుకు నాగ్‌ అశ్విన్‌ పడిన కష్టం చిత్రం అణువణువునా కనిపిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజకి మేజర్ ప్లస్ పాయింట్. సెకండాఫ్ లో ది బెస్ట్ స్కోర్ అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు 22 కోట్లతో నిర్మించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే 'సింగ్ గీతం' మూవీకి రోజురోజుకూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ మూవీకి తొలిరోజున భారత్ లో రూ. 54 లక్షల నెట్ రాబట్టినట్లు సాక్ నిక్ స్పష్టం చేసింది. అలాగే నార్త్ అమెరికాలో తొలిరోజున దాదాపు 17 వేల డాలర్లు సాధించినట్లు తెలుస్తోంది. అంటే మన భారత కరెన్సీలో రూ. 16 లక్షలు అని అర్థం.

SingGeetam First Day Collection How Much Did the Movie Earn on Its Opening Day SingGeetam movie

మొత్తంగా ఈ మూవీకి తొలిరోజు దాదాపు రూ. 80 లక్షలకు పైగా నెట్.. అలాగే కోటికి పైగా గ్రాస్ వసూల్లు అయినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బుక్ మై షో లో గంటకు వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో మౌత్ టాక్ తో ఈ మూవీకి కలెక్షన్స్ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మూవీలో అయాన్‌, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి తదితరులు కీలక పాత్రలు చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+