ఆ కటౌట్, ఆ ఫైర్, ఆ రఫ్ నెస్ చూసే..!!

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.

ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనం.. టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనపర్చడం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 100 కు పైగా స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే రెండు, డీఎంకే మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగ్ తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోండటంతో సీట్ల సంఖ్య మరింత పెరగొచ్చు.

Vijay rough rugged and Common Man look brought him closer to Voters in Tamil Nadu TVK Perfect debut

అరంగేట్రంలోనే విజయ్ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడానికి కారణాలు లేకపోలేదు. ద్రవిడ మోడల్ కు భిన్నంగా పార్టీని నిలిపారాయన. ఇక్కడ పాతుకుపోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే ఇతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా తానొకడిని ఉన్నానని అతి తక్కువ కాలంలోనే నిరూపించుకున్నాడు. అదే స్థాయిలో జనంలోకి వెళ్లగలిగాడు.

ప్రచార సమయంలో అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ మడమ తిప్పకపోవడం ఆకట్టుకుంది. సీబీఐ కేసులు ఎదుర్కొనాల్సి వచ్చినప్పటికీ.. వాటిని చిరునవ్వుతోనే స్వీకరించడం ఆయన మొండి ధైర్యానికి నిలువెత్తు అద్దం పట్టింది. తన వస్త్ర ధారణలో కూడా ఎక్కడ కూడా స్టార్ హోదా కనిపించనివ్వలేదు విజయ్. మాసిన గెడ్డంతోనే రాష్ట్రవ్యాప్తంగా తిరిగాడు. గుబురుగా పెరిగిన జుట్టుతోనే ప్రచారం సాగించాడు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ కలియతిరిగాడు విజయ్.

సాధారణంగా తమిళియన్స్ రఫ్ గా కనిపిస్తారు. రగ్డ్ లుక్ లో దర్శనం ఇస్తుంటారు. తన వస్త్రధారణలో దాన్నే ఫాలో అయ్యాడు విజయ్. లూజ్ షర్ట్, దానికి తగ్గ ప్యాంట్ తో ఓ సాధారణ మధ్య తరగతి యువకుడిలా కనిపించాడే తప్ప హీరో అనే భేషజాలకు పోలేదు. అది.. యువ ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సంప్రదాయ ఓటుబ్యాంక్ పట్ల అప్పటికే మొహం మొత్తి ఉన్నారేమో.. విజయ్ వైపు మొగ్గు చూపారు. భారీగా ఓట్లు గుద్దిపడేశారు. స్టైలిష్ రాజకీయాలకు పాతర వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+