ట్రంప్‌పై హత్యాప్రయత్నం.. రంగంలోకి దిగిన ఎలన్ మస్క్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యా ప్రయత్నం జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్‌లో జరిగిన వార్షిక 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' కార్యక్రమంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ హై-ప్రొఫైల్ కార్యక్రమంలో ట్రంప్ సహా అమెరికా అగ్రశ్రేణి అధికారులు ఉండగా.. ఓ దుండగుడు సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను దాటుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ పరిణామంపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఈ ఘటనను ఖండిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడం కోసం వారు తమ ప్రాణాలను ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు" అని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న హింసాత్మక ధోరణి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యాప్రయత్నం విఫలమైనప్పటికీ.. ఇది అమెరికా భద్రతా వ్యవస్థల్లోని లోపాలను, రాజకీయ ద్వేషం ఏ స్థాయికి చేరుకుందో సూచిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఘటనా వివరాలిలా..
ఈ దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 31 ఏళ్ల వయసున్న ఓ అనుమానితుడు షాట్‌గన్, హ్యాండ్‌గన్ వంటి మారణాయుధాలతో హిల్టన్ హోటల్ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని అడ్డుకునే క్రమంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉన్న జర్నలిస్టులు, రాజకీయ నాయకులు భయాందోళనకు గురై టేబుళ్ల కింద దాక్కున్నారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ పెనుగులాటలో ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు బుల్లెట్ తగిలినప్పటికీ.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఈ దాడిని ఒంటరిగానే ప్లాన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తన భద్రతా సిబ్బంది అప్రమత్తతను మెచ్చుకున్నారు. ఓ ఏజెంట్ గాయపడినట్లు ఆయన ధ్రువీకరించారు. 45 ఏళ్ల క్రితం ఇదే హోటల్‌లో అప్పటి అధ్యక్షుడు రీగన్‌పై కూడా కాల్పులు జరిగాయి, ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం కావడం గమనార్హం. ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications