అల్లరి నరేష్ కొత్త మూవీ "రంభ ఊర్వశి మేనక".. లుక్ అదిరిందిగా !!

టాలీవుడ్‌లో కామెడీకి కొత్త నిర్వచనం చెప్పిన హీరోల్లో అల్లరి నరేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఆయన.. గత కొన్నేళ్లుగా నాంది, ఉగ్రం, బచ్చల మల్లి వంటి సీరియస్ పాత్రలతో నటుడిగా మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు మళ్లీ తన అసలైన బలమైన కామెడీ జానర్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అల్లరి నరేష్ 65వ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'రంభ ఊర్వశి మేనక' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా కాన్సెప్ట్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు చంద్ర మోహన్ చింతడ. అవుట్ అండ్ అవుట్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు "Comedy Goes Cosmic" అనే ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్‌ను మేకర్స్ ప్రకటించారు.

allari-naresh-starring-new-movie-title-confirmed-as-ramba-urvashi-menaka-and-poster-got-viral

ఫస్ట్ లుక్‌లోనే భారీ సర్‌ప్రైజ్..

ఇప్పటి వరకు భూలోకంలో కామెడీ చేసిన అల్లరి నరేష్.. ఈసారి స్వర్గలోకంలో నవ్వుల పండుగ సృష్టించబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతోంది. దీంతో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో అల్లరి నరేష్ స్టైలిష్ లుక్‌లో గ్లాసెస్ ధరించి, స్వర్గానికి వెళ్లే మెట్లపై కూర్చొని కనిపిస్తారు. ఆయన చేతిలో పెద్ద స్క్రోల్, మరో చేతిలో పెన్ను ఉండగా... ఆ స్క్రోల్‌పై 'రంభ, ఊర్వశి, మేనక' పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెనుకవైపు మేఘాల మధ్య అప్సరసలు విహరిస్తూ ఉండటం, స్వర్గాన్ని తలపించే విజువల్స్, ఫాంటసీ టచ్ పోస్టర్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.

ఈ చిత్రంలో అల్లరి నరేష్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కామెడీ నటులు నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, నరేష్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నలుగురు ఒకే సినిమాలో ఉండటంతో థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయమని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఒక్కో పాత్రకు ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫాంటసీ ప్రపంచాన్ని భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించేందుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణ వ్యయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్‌గా కూడా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, ఎడిటర్‌గా ఛోటా కె ప్రసాద్ పని చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+