ఈశాన్య తీరంలో భారీ ఉపద్రవం

Japan earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఈశాన్య ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో స్థానిక అధికారులు తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు. బీచ్ లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రకంపనల తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారాయి. పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా రికార్డయింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని హొక్కాయిడో ప్రీఫెక్షర్ లోని టొకాచీ రీజియన్ లో భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 1:06 నిమిషాలకు భూమి ప్రకోపించింది. రాజధాని టోక్యోకు ఈశాన్యదిశగా 1,280 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఉత్తరం- ఈశాన్య దిశగా 42.691 ఉత్తర అక్షాంశం, 143.146 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించాయి.

Earthquake Northern Japan Hit by 6 1 Magnitude Quake in Hokkaido Residents Urged to Stay Calm

ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల దిగువన టెక్టోనిక్ ప్లేట్లల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు వివరించాయి. భూకంప ప్రభావం సమీప ప్రాంతాలపై పడింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. బీటలు వారాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తొలుత- సునామీ సంభవించవచ్చంటూ వార్తలొచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాలేదు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదవుతోండటంతో జనం తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.

జపాన్.. భూగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో క్రియాశీలక అగ్నిపర్వత జోన్‌లో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్‌వర్క్‌లో ఉన్నందున ప్రకంపనలు సర్వసాధారణం. మూడు లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో భూమి తరచూ ప్రకంపిస్తుంటుందక్కడ. ఆరుకు పైగా తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జపాన్‌లో భూకంప తీవ్రతను లెక్కించడానికి షిండో స్కేల్‌ను ఉపయోగిస్తారు. ఇది అమెరికాలో ఉపయోగించే మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ స్కేల్. భూకంపం విడుదల చేసే మాగ్నిట్యూడ్ ను రిక్టర్ స్కేల్ కొలుస్తుంది. షిండో స్కేల్ ప్రకారం.. నాలుగు లేదా అంతకంటే తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలను తేలికపాటివిగా పరిగణిస్తారు. అయిదు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలు తీవ్రమైనవిగా భావిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+