ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ పై గుడ్ న్యూస్..!

ఏపీలో వెనుకబడిన తరగతుల విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిలతో పాటు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులపై (Post-Metric Scholarship) ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం త్వరలోనే విద్యార్ధుల ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం వేళ వారికి ఈ నిధులు ఉపయోగపడే అవకాశం ఉంది.

రాష్ట్రంలో బీసీ విద్యార్ధులకు రెండు సంవత్సరాల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ బకాయిల చెల్లింపుకు వీలుగా ప్రభుత్వం రూ.1315.06 కోట్లు విడుదల చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిధుల్ని విడుదల చేసి విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని విజయవాడలోని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 95ను జారీ చేసింది. దీని ప్రకారం త్వరలోనే బీసీ విద్యార్ధులకు స్కాలర్ షిప్ బకాయిలు అందనున్నాయి.

AP Govt Releases Post-Matric Scholarship Fee Reimbursement Funds for Students

మరోవైపు రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని సైతం ప్రభుత్వం విడుదల చేస్తోంది.
బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు రూ.1315.14 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.2024-25, 2025-26 సంవత్సరాలకు గానూ విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని ఇప్పుడు చెల్లిస్తున్నారు. ఈ నిధుల్ని సైతం విడుదల చేసి విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం జీవో నంబర్ 94 ద్వారా విజయవాడలోని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+