రైతు భరోసా నిధుల విడుదల వేళ కీలక మార్పు... ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

రైతు భరోసా నిధుల విడుదల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అక్కడ నుంచే అర్హత ఉన్న అందరి రైతులకు రైతు భరోసా నిధుల విడుదలకు డిసైడ్ అయింది. అయితే, తాజాగా ప్రభుత్వం నిర్ణయం మార్పు చేసింది. వేదికను మార్చింది. ఇదే సమయంలో రైతు భరోసా నిధుల విడుదల పైనా స్పష్టత ఇచ్చింది.

మధిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు భరోసా సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, రైతుభరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపు (మంగళవారం) సాయంత్రం 4గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయడంతోపాటు రైతులనుద్దేశించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. మధిరలో బహిరంగ సభ రద్దయినప్పటికీ.. నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని డిసైడ్ అయ్యారు.

 తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం..!!
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం..!!
rythu-bharosa-distribution-conference-to-hold-it-at-shilpakala-vedika-in-hyderabad-on-30th-june

హైదరాబాద్ కేంద్రంగా నిధుల విడుదల

కాగా, ఇప్పటికే రైతు భరోసా మార్గదర్శకాలపై సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం, అర్హులైన ప్రతి రైతుకూ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంది. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వానాకాలం సీజన్‌లో ఈ నిధులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ముఖ్యమంత్రి సభలో నిధులు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో డీబీటీ పద్దని డబ్బులు జమ కానున్నాయి. కాగా, ఈ సారి అర్హత ఉన్న రైతులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జూలై 5వ తేదీ వరకు పథకంలో లబ్దిదారులుగా లేని వారికి దరఖాస్తు చేసుకునేందుకు గడువుగా నిర్ణయించింది. వారి దరఖాస్తులు పరిశీలన చేసి.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత ఉంటే.. వారికీ భరోసా కింద నిధులు అందించాలని డిసైడ్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+