ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. అస్సలు మిస్ అవ్వొద్దు..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'.. జూలై 24 న విడుదలైన ఈ మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ఆగస్టు 21 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుందని తెలిపింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఇలా మొత్తం ఐదు భాషల్లో చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకుపైగానే కలెక్షన్స్ వచ్చాయి. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. మూవీ రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన తొలి రోజు రూ.5.15 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఈ మూవీ నిలిచింది. అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ మూవీలో హీరో కిరణ్ అబ్బవరం- శ్రీ గౌరిప్రియ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ సహజసిద్ధమైన నటనతో తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇక మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు.

kiranabbavaram Chennai Love Story heads to OTT streaming on SonyLIV from August 21 KiranAbbavaram

సొంత ఊరు వదిలి జాబ్ కోసం చెన్నైకు వచ్చిన ఇద్దరు యువతీ యువకుల ప్రయాణాన్ని దర్శకుడు తెరకెక్కించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కిరణ్ అబ్బవరం తన నటనలో ఎంతో పరిణతి చూపించారు. గత చిత్రాల కంటే ఆయన నటన ఈ మూవీలో విశేషంగా ఆకట్టుకుంటుంది. మూవీలోని స్టీవెన్ శంకర్ పాత్రలో ఒదిగిపోయారు. అటు గౌరీ ప్రియా భావోద్వేగపూరిత నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బేబి మూవీ ఫేం డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ​ప్లే అందించారు. అలాగే ఎస్​కేఎన్, సాయిరాజేశ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీ ఆగస్టు 21 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+