Varanasi: రాజమౌళి సంచలన నిర్ణయం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

Varanasi: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. తాజాగా 'వారణాసి' షూటింగ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వినిపిస్తోంది. మహేశ్ బాబుకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు సమాచారం. సినిమా షూటింగ్ కూడా 90 శాతం పూర్తి అయిందనీ, తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన పనులు పూర్తయిన తర్వాత రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు టాక్.

డబ్బుల కోసం జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసుకున్న 'ఢీ 10’ విన్నర్ రాజు
డబ్బుల కోసం జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసుకున్న 'ఢీ 10’ విన్నర్ రాజు

ట్రైలర్ లేకుండానే సినిమా?
ఇదిలా ఉంటే 'వారణాసి' ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి కొత్త వ్యూహాన్ని అనుసరించబోతున్నారట. ఇప్పటికే ఇంటర్నేషన్ లెవల్ లో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్, ప్రమోషన్స్, స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజా రాజమౌళి స్ట్రాటజీ అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే.. వారణాసి మూవీ ట్రైలర్‌ను విడుదల చేయకుండానే నేరుగా థియేటర్లలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. దీనికి ప్రధాన కారణం మహేశ్ బాబు రామ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను సీక్రెట్ గా ఉంచడమేనంట. ట్రైలర్ విడుదల చేస్తే ఇంపార్టెంట్ విజువల్స్ ముందుగానే బయటకు వచ్చే అవకాశం ఉందని, అందుకే ప్రేక్షకులు మహేశ్‌ను రామ్‌గా తొలిసారి థియేటర్‌లోనే చూసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Varanasi Rajamouli May Skip The Trailer To Keep Mahesh Babu s Ram Look Secret

ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే?
'వారణాసి' ప్రమోషన్స్‌ను కూడా పరిమితంగా నిర్వహించాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. మీడియా మీట్లు, ప్రెస్ మీట్లు, వరుస ఇంటర్వ్యూలకు బదులుగా తెలుగు అభిమానుల కోసం ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా గురించి ఎక్కువ విషయాలు ముందుగానే వెల్లడించకుండా మిస్టరీని కొనసాగించడమే ఈ వ్యూహం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఇంకా ప్రమోషనల్ కంటెంట్ అవసరం లేదని టీమ్ భావిస్తోందనే చర్చ జరుగుతోంది.

వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!
వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!

మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
అయితే, జక్కన్న ప్లాన్‌పై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తమ హీరో సినిమా నుంచి టీజర్, ట్రైలర్, పోస్టర్లు, ఈవెంట్లు వంటి అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్ కోరుకోవడం సహజం. మరోవైపు ట్రైలర్ లేకుండా, ఇంపార్టెంట్ లుక్‌ను దాచిపెట్టి సినిమా చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చు. ముఖ్యంగా మహేశ్ బాబు రామ్ పాత్రను థియేటర్‌లో తొలిసారి చూసే అవకాశం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచవచ్చు.

బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు
బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు

ప్లాన్ మారే అవకాశం ఉందా?
'వారణాసి' విడుదలకు ఇంకా సమయం ఉండటంతో రాజమౌళి తన ప్రమోషన్ వ్యూహంలో మార్పులు తీసుకరావచ్చు. అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ భాగస్వాముల కోరికను బట్టి జక్కన్న తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మాత్రం ట్రైలర్‌ను పరిమితం చేయడం, మహేశ్ రామ్ లుక్‌ను దాచడం, ఫ్యాన్ ఫోకస్డ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. వీటిపై అధికారిక క్లారిటీ రావాలంటే మేకర్స్ ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+