వేణుమాధవ్ చివరి మాటలివే.. వాళ్లను నమ్మొద్దంటూ.. ఉదయభాను ఎమోషనల్
యాంకర్ ఉదయభాను.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగునాట యాంకరింగ్‌కు స్టార్‌డమ్‌ను, గ్లామర్‌ను తీసుకొచ్చిన ఘనత ఉదయభానుదే. అప్పట్లో దూరదర్శన్ నుంచి మొదలుపెట్టి ఏ ఛానెల్ చూసినా సరే తనే కనిపించేది. కొన్నేళ్ల పాటు వెండితెర, బుల్లితెరలపై తనదైన ముద్ర వేసి.. ఎంతోమంది యువతను యాంకరింగ్ వైపు నడిపించారు ఉదయభాను. అయితే అనూహ్య పరిణామాల మధ్య సినిమాకు, బుల్లితెరకు దూరమయ్యారు. ఇటీవలే తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉదయభాను.. నటిగా, యాంకర్‌గా తన మార్క్ చూపించడంతో పాటు ఈసారి నిర్మాతగా అవతారమెత్తారు. పంచనామా పేరుతో వెబ్ సిరీస్ నిర్మించి నిర్మాణ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అయితే అప్పట్లో స్టార్ కమెడియన్ వేణుమాధవ్‌తో కలిసి బుల్లితెరపై సందడి చేశారు ఉదయభాను. డ్యాన్స్ బేబీ డ్యాన్స్, వన్స్ మోర్ ప్లీజ్ వంటి కార్యక్రమాలకు వీరిద్దరూ హోస్టింగ్ చేసేవారు. వేణు పంచ్‌లు, మిమిక్రీకి ఉదయభాను అందాలు తోడు కావడంతో అప్పట్లో ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించడంతో పాటు వీరిద్దరూ తెలుగు లోగిళ్లకు బాగా దగ్గరయ్యారు. అనంతర కాలంలో వేణుమాధవ్ సినిమాలలో బాగా బిజీ అయ్యారు. స్టార్ కమెడియన్‌లలో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే చాలా చిన్న వయసులోనే అనారోగ్యంతో వేణుమాధవ్ కన్నుమూయడంతో తెలుగు ప్రజలను విషాదంలోకి నెట్టింది. తాజాగా తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుమాధవ్‌తో తన అనుబంధాన్ని, ఆయన చివరి రోజులను గుర్తుచేసుకుని ఉదయభాను ఎమోషనల్ అయ్యారు.

వేణుమాధవ్ నన్ను చిన్నప్పటి నుంచి చూశారు.. నా గురించి తనకు అన్నీ తెలుసు. నేను దేనికి ఎమోషనల్ అవుతాను వంటి విషయాలు తెలుసు. మిగతా వాళ్లతో చాలా అల్లరి చిల్లరిగా ఉండేవాడు.. నోటీ దురుసు ఎక్కువ. ఎవరు కనిపించినా సరే ఒక కామెంట్ చేయకుండా వదలడు, కానీ నన్ను మొదటి నుంచి చాలా గౌరవించేవాడు. మాట్లాడినా తప్పుగా ఒక్క పదం కూడా పోర్లేది కాదు. నా మీద కూడా పంచ్‌లు వేసేవాడు.. నీ హై హీల్స్ ఎక్కి సూసైడ్ చేసుకోవచ్చు అనేవాడు. నేను చాలా హైట్ ఉంటే నా భుజాల వరకు వచ్చేవాడు. ఎంత ఏడిపించినా తన హద్దుల్లో ఉండేవాడు అని ఉదయభాను తెలిపారు.
నేను ఒక కామెడీ షోకు వేణుమాధవ్‌ని జడ్జిగా పిలవడానికి వెళ్తే.. ఆయన ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారని చెబితే వెంటనే ఫోన్ చేశాను. వేణు.. నీ గురించి ఇలా మాట్లాడుతున్నారని చెప్పాను. దాంతో భాను.. వాళ్లు దొంగ నా కొ**లు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు, నేను మంచిగానే ఉన్నాను నాకేమైంది అని అన్నాడు. నేను మాత్రం దయచేసి నీ ఆరోగ్యం కాపాడుకో.. ప్రాణం ఉంటేనే మనం పోరాడగలం, ఎక్కడి వరకైనా వెళ్లగలం అని చెప్పా. కానీ ఓ రోజున వేణుమాధవ్ లేరని తెలిసి తట్టుకోలేకపోయా. ఆయన ఓ గొప్పనటుడు, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, కోటాగారు లాంటి నటులు ఒక్క సెకనులో ఇచ్చే హావభావాలు మరొకరు ప్రదర్శించలేరు. మనమంతా పెట్టి పుట్టాం... అలాంటి నటులు మన తెలుగువారికి దొరికారు. అంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్లిపోవడం ఇండస్ట్రీకి తీరని లోటని వేణుమాధవ్ గురించి ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications
