ఆ స్టార్ దర్శకుడితో 'ఉప్పెన' హీరో సినిమా.. మెగా ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్..!

తొలి సినిమా ఏ హీరోకు అయినా స్పెషలే.. ఫస్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చాలామంది హీరో హీరోయిన్లు కలలు కంటుంటారు. అయితే అది అందరి విషయంలోనూ అనుకున్నట్లు జరగదు. సెలబ్రిటీల తొలి సినిమా ఒక్కోసారి హిట్ అవ్వొచ్చు.. ఒక్కోసారి ప్లాఫ్ అవ్వొచ్చు. అయితే మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ విషయంలో మాత్రం ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీతో తొలి సినిమాతోనే ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ అందుకుని సంచలనం సృష్టించాడు వైష్ణవ్ తేజ్.

ఈ మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మూవీతో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ బెస్ట్ మేల్ డెబ్యూట్ ను కూడా అందుకున్నాడు. ఇక ఉప్పెన మూవీ ఇచ్చిన కిక్ తో ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కానీ అవేమీ పెద్ద హిట్ కాలేదు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2021 లో కొండపొలం అనే సినిమా చేశాడు. అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అలాగే 2022 లో రంగరంగ వైభవంగా మూవీలో నటించాడు. ఆ మూవీ కూడా ఆశించినంత విజయం సాధించలేదు. చివరగా 2023 లో పంజా వైష్ణవ్ తేజ్- శ్రీలీల కాంబోలో ఆదికేశవ అనే మూవీ వచ్చింది. కానీ ఈ మూవీ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

Panja Vaisshnav Tej Uppena hero is currently working on a film with director Parasuram viral news

అలా ఉప్పెన తర్వాత వరుస ప్లాఫ్ ల నేపథ్యంలో పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నుంచి సినిమా రాక మూడేళ్లు దాటింది. అయితే తన నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే పంజా వైష్ణవ్ తేజ్ కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. పరశురామ్ గతంలో గీతాగోవిందం, సర్కారు వారి పాట, ఫ్యామిలీ మ్యాన్ తదితర చిత్రాలను తెరకెక్కించారు. పంజా వైష్ణవ్ తేజ్- పరశురామ్ కాంబోపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై కీలక విషయాలు వెల్లడికానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+