"ప్రభుత్వంపై నిరసనకు ప్రభుత్వం అనుమతా ?"-కాక్రోచ్ ల ప్రశ్న- ఢిల్లీ పోలీసులకు జస్ట్..!

ఎస్ఐఆర్ లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) .. ముంబై నుంచి ఢిల్లీకి మకాం మార్చబోతోంది. అక్టోబర్ 10న ముంబై నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ కు చేరుకుని ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఈ భారీ నిరసనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పేస్తున్న వేళ.. సీజేపీ నేత సౌరవ్ దాస్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?
సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?

అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే ఆందోళనలకు అనుమతులు తీసుకోవాలంటూ తమకు ఎదురవుతున్న ప్రశ్నలపై స్పందించిన సీజేపీ నేత సౌరవ్ దాస్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే నిరసనలకు తిరిగి ప్రభుత్వం అనుమతి ఎందుకని ప్రశ్నించారు. బ్రిటీష్ కాలంలో నిరసనలకు స్వాతంత్ర సమరయోధులు ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఢిల్లీలో తాము చేపట్టే ఆందోళనలకు ప్రభుత్వం నిర్దేశించిన నిరసన స్థలం జంతర్ మంతర్ వద్ద తాము నిరసనలు చేపడతామని సౌరవ్ దాస్ తెలిపారు. అసలు అనుమతి అనే పదాన్ని తాము వాడబోమన్నారు. తమకు అనుమతి ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు ఎవరన్నారు. అందుకే కేవలం సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు.

CJP Informs Delhi Police of October 10 Jantar Mantar Protest Says No Permission Needed

తొలిరోజే కాక్రోచ్ లకు షాక్..! పోటీ నిరసనలు..! పోలీసులకు ఫిర్యాదులు..!
తొలిరోజే కాక్రోచ్ లకు షాక్..! పోటీ నిరసనలు..! పోలీసులకు ఫిర్యాదులు..!

ఈ మేరకు ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు వెళ్లి సౌరవ్ దాస్ అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద చేపట్టే నిరసనలకు సంబంధించి సమాచారం ఇచ్చి వచ్చారు. ఈ నిరసనలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, తమ ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవాలని సౌరవ్ దాస్ పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని, అవి ఇకపైనా కొనసాగుతాయని తేల్చిచెప్పారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి అని, ఆయనకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఈ దేశ యువత అక్టోబర్ 10 నుంచి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతుందని ప్రకటించారు. జంతర్ మంతర్ లో తాము చేపట్టే నిరసనలపై పోలీసులకు సమగ్రంగా వివరాలు సమర్పించినట్లు తెలిపారు. ఈ ఆందోళనల సందర్భంగా పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తామని సౌరవ్ దాస్ వెల్లడించారు. ఇప్పటికే తాము మౌఖికంగా అక్టోబర్ 10 ధర్నాపై పోలీసులకు మౌఖికంగా సమాచారం ఇచ్చామని, ఇవాళ రాతపూర్వకంగా సమాచారం ఇచ్చామన్నారు. నిన్న విపక్ష ఎంపీలకు ఈసీని కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని సౌరవ్ దాస్ ఆక్షేపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+