సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!

కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో సీఈసీ మిగతా ఇద్దరు కమిషనర్లను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లు కానీ, మెజార్టీ లేకుండా చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నట్లు కానీ తేలితే వాటన్నింటినీ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఆ మేరకు రికార్డుల్ని సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గతంలో కోర్టులు ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకుని రద్దు (Election Results) చేసిన ఆరు సందర్భాల్ని ఓసారి చూద్దాం..

ఇందిరా గాంధీ (రాయ్‌బరేలీ, 1975)

1971 లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌బరేలీ నుండి ఇందిరా గాంధీ సాధించిన విజయాన్ని ఆమె ప్రత్యర్థి రాజ్ నారాయణ్ సుప్రీంలో సవాలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 2న ఇందిరా గాంధీ ఎన్నికను రద్దు చేసి, ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించింది. ఈ తీర్పు తర్వాతే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

6 Times Courts Set Aside Election Results as supreme court warns to annul ec decisions if against law
సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?
సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?

కె.ఎం. మణి, సి.హెచ్. మహమ్మద్ కోయా ఎన్నికలు ( 1977)

1977 కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మతపరమైన ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎ.కె.ఆంటోనీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సి.హెచ్.మహమ్మద్ కోయా, కె.ఎం. మణిల ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత, సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఎన్ శివన్ పిళ్ళై - (1982 కేరళ అసెంబ్లీ ఎన్నికలు)

1982 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో, ఉత్తర పరావూర్ నియోజకవర్గంలోని 50 పోలింగ్ కేంద్రాలలో మొదటిసారిగా ఈవీఎంలను వాడారు. ఇక్కడ సీపీఐకి చెందిన ఎన్ శివన్ పిళ్ళై 123 ఓట్ల తేడాతో గెలిచారు. ఆయన ప్రత్యర్థి ఏసీ జోస్, ఈవీఎంల వాడకానికి చట్టపరమైన నిబంధన ఏదీ లేదని కోర్టులో వాదించారు. 1984లో సుప్రీంకోర్టు జోస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చి, పిళ్ళై ఎన్నికను రద్దు చేసింది. ఆ 50 కేంద్రాలలో బ్యాలెట్ పేపర్లతో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో జోస్ గెలిచారు.

ఎంజే జాకబ్ కేసు (కేరళ, 2006)

2006 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పిరవం స్థానం నుండి ఎల్‌డీఎఫ్ అభ్యర్థిగా ఎంజే జాకబ్ పోటీ చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా ముఖ్యంగా తన ప్రత్యర్థి యూడీఎఫ్ నేత టీఎం జాకబ్ కి వ్యతిరేకంగా ప్రచారం సందర్భంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే కరపత్రాలను పంపిణీ చేశారనే ఆరోపణలపై, జాకబ్ ఎన్నికల విజయాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది.

Form 6 మార్పు: కమిషనర్ల అభ్యంతరాలు-ఈసీ సమర్ధన-చివరికి సుప్రీం బిగ్ ట్విస్ట్..!
Form 6 మార్పు: కమిషనర్ల అభ్యంతరాలు-ఈసీ సమర్ధన-చివరికి సుప్రీం బిగ్ ట్విస్ట్..!

కె.ఎం. షాజీ కేసు (కేరళ, 2018)

2016 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో అళికోడ్ నియోజకవర్గం నుండి ఐయూఎంఎల్ (యూడీఎఫ్) ఎమ్మెల్యేగా గెలుపొందిన కె.ఎం. షాజీ ఎన్నికల విజయాన్ని, ఆయన ప్రత్యర్థి ఎం.వి. నికేష్ కుమార్ (ఎల్‌డీఎఫ్) సవాల్ చేశారు. దీంతో 2018 నవంబర్‌లో కేరళ హైకోర్టు ఈ ఫలితాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. ప్రచార సమయంలో కేవలం ముస్లిం అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతూ కరపత్రాలు పంపిణీ చేసినందుకు, మతపరమైన మనోభావాలను దుర్వినియోగం చేసినందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 123(3) కింద ఆయన తీవ్రమైన ఆరోపణలలో దోషిగా తేలారు. దీనిపై షాజీ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అది ఆయన అనర్హతపై మధ్యంతర స్టే ఇచ్చి, ఓటింగ్ హక్కులు లేదా రోజువారీ భత్యాలు లేకుండానే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనుమతించింది.

6 Times Courts Set Aside Election Results as supreme court warns to annul ec decisions if against law
సుప్రీంలో దొరికిపోయిన సీఈసీ..! వెబ్ సైట్లో వివరణ మాయం.! సీజేపీ చెడుగుడు..!
సుప్రీంలో దొరికిపోయిన సీఈసీ..! వెబ్ సైట్లో వివరణ మాయం.! సీజేపీ చెడుగుడు..!

ఓపీ రవీంద్రనాథ్ కుమార్ (2019 లోక్‌సభ ఎన్నికలు)

2023 జూలైలో తమిళనాడులోని తేని నియోజకవర్గం నుండి ఏకైక ఏఐఏడీఎంకే ఎంపీగా ఎన్నికైన, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం కుమారుడైన ఓపీ రవీంద్రనాథ్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికల విజయాన్ని మద్రాస్ హైకోర్టు చెల్లదని ప్రకటించింది. ఆ నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు దాఖలు చేసిన పిటిషన్‌లో, రవీంద్రనాథ్ తన నామినేషన్ పత్రాలలో ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టారని, ప్రచార సమయంలో ఓటర్లకు లంచం ఇవ్వడానికి లేదా వారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ చర్యలు అనుచితమైనవని కోర్టు భావించింది. చివరికి హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+