ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్: ఈ రెండింట్లో మనోళ్లదే హవా

వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్ లేటెస్ట్ ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. కొద్దిసేపటి కిందటే ఐసీసీ వీటిని విడుదల చేసింది. ఈ రెండు ఫార్మట్లల్లో కూడా టీమిండియా హవా కనిపించింది. వన్డే ర్యాంకింగ్ లల్లో టీమిండియా కేప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన టాప్ పొజీషన్ ను నిలబెట్టుకున్నాడు. 902 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

18 స్థానాలు ఎగబాకి..

అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 18 స్థానాలు ఎగబాకాడు. ఏడో స్థానంలో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 43 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 102 పరుగులతో అజేయుడిగా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్.. అతన్ని టాప్ 10లోకి చేర్చింది. ఏకంగా 18 స్థానాలను మెరుగుపరుచుకుని 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ స్థానానికి అయ్యర్ రావడం ఇదే మొదటిసారి. 786 పాయింట్లను దక్కించుకున్నాడు.

Shreyas Iyer Breaks Into India s Top 10 as ICC T20I Rankings Soar after Century as Career Best No 7

టాప్ లో హవా..

ఈ కేటగిరీలో టాప్-10 లో నిలిచిన నాలుగో భారత బ్యాటర్‌ అతను. ఇషాన్ కిషన్- 902 అభిషేక్ శర్మ- 887 పాయింట్లతో మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. వెస్టిండీస్ పై అజేయంగా 37 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోగా, అదే మ్యాచ్ లో దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. 719 పాయింట్లతో తిలక్ వర్మ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. 719 పాయింట్లతో పాకిస్తాన్ కేప్టెన్ సాహిబ్‌జాదా ఫర్హాన్ మూడో స్థానం, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్- 793, జోస్ బట్లర్- 789 పాయింట్లతో టాప్ 5లో ఉన్నారు.

వుయ్ విల్ టేక్ ఎ కాల్.. ఈసీ వ్యవహారంపై తేల్చి చెప్పిన సీజేఐ సూర్యకాంత్ బెంచ్
వుయ్ విల్ టేక్ ఎ కాల్.. ఈసీ వ్యవహారంపై తేల్చి చెప్పిన సీజేఐ సూర్యకాంత్ బెంచ్

టీ20 బౌలింగ్ లోనూ భారత్‌ సత్తా చాటింది. ఆసియా క్రీడలలో అద్భుత బౌలింగ్‌తో రాణించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ టాప్ లో నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ రెండో స్థానానికి పడిపోయాడు.

వన్డేల్లో అదే తీరు..

వన్డే ఫార్మాట్ బ్యాటర్ల విభాగంలో శుభ్‌మన్ గిల్ తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. వెస్టిండీస్‌పై రెండో వన్డేలో అజేయ డబుల్ సెంచరీసాధించిన గిల్.. రెండో స్థానంలో ఉన్న డారిల్ మిఛెల్‌పై ఏకంగా 47 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించాడు. ఈ డబుల్ సెంచరీ తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న అంతరం 47 పాయింట్లకు పెరిగింది. విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోగా.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 6వ ర్యాంకుకు ఎగబాకాడు.

నాలుగో స్థానంలో రోహిత్ శర్మ- 770, అయిదో స్థానంలో ఇబ్రహీం జడ్రాన్- 719 ఉన్నారు. టాప్ 10లో ఆ తర్వాతి స్థానంలో బాబర్ ఆజమ్- 689, కుశాల్ మెండీస్- 674, జో రూట్- 660, కేఎల్ రాహుల్- 653 ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+