చంద్రబాబు పంజరంలో చిలుకలా ఈడీ ? వైఎస్సార్సీపీ ఎంపీ ఫైర్ ..!
ఏపీలో తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు కనిపిస్తోంది. ముఖ్యంగా విపక్ష వైఎస్సార్సీపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు కేసుల్లో ఈడీ హడావిడి పెరిగింది. ఇందులో మొదటిది వివేకానందరెడ్డి హత్య కేసు కాగా.. రెండవది మద్యం స్కాం. ఈ రెండు కేసుల్లోనూ ఈడీ అసలు దర్యాప్తు సంస్థలైన రాష్ట్ర సిట్, కేంద్ర సంస్థ సీబీఐ కంటే ఎక్కువగా దూకుడు ప్రదర్శిస్తోంది. దీనిపై తిరుపతి వైసీపీ ఎంపీ (YSRCP MP) మద్దిల గురుమూర్తి (Maddila Gurumoorthy) ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా, మద్యం కేసుల్లో పార్టీ నేతల్ని వరుసగా టార్గెట్ చేసేలా తనిఖీలు చేస్తూ, అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్న వైనంపై గురుమూర్తి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈడీ ఇప్పటికీ ఒక స్వతంత్ర కేంద్ర సంస్థేనా, లేక అది చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వ సిట్ కు అనుబంధంగా మారిపోయిందా? అంటూ ఎంపీ గురుమూర్తి ఇవాళ ట్వీట్ లో ప్రశ్నించారు. ఈ ధోరణి బరితెగించినట్లుగా ఉందని, తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. నోటీసులు, దాడుల వివరాలు మొదట ఎల్లో మీడియాలో "ఎక్స్‌క్లూజివ్" స్కూప్‌లుగా బయటపడతాయని, ఆ తర్వాత, దాదాపు సూచన అందినట్లుగా, కొన్ని గంటలకే ఈడీ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు.

Is the ED @dir_ed still an independent central agency, or has it become an extension of @ncbn 's coalition government’s SIT?The pattern is brazen and deeply troubling: details of notices and raids surface first as “exclusive” scoops in Yellow Media, and then, almost on cue, the ED follows the same script hours later. The ED is dancing to Chandrababu Naidu’s tunes in the foisted liquor and other cases, carrying forward his government’s SIT narrative and targeting YSRCP to serve his political interests and settle scores with the opposition.If an investigative agency starts looking less like an independent institution and more like an instrument of political vendetta, the public is left with a serious question: are we witnessing an investigation or state-sponsored theatre?Institutions earn public trust through independence, transparency, and due process. Once they are replaced by political scripts, that trust is the first casualty.@ndtv @IndiaToday @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @thewire_in @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic
— Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 7, 2026
వైఎస్సార్సీపీపై బనాయించిన మద్యం, ఇతర కేసులలో ఈడీ చంద్రబాబు పాటలకు నాట్యం చేస్తోందని గురుమూర్తి విమర్శించారు. ప్రభుత్వ సిట్ కథనాన్ని ముందుకు తీసుకెళ్తూ, తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ప్రతిపక్షాలపై పగ తీర్చుకోవడానికి వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపారు. ఒక దర్యాప్తు సంస్థ స్వతంత్ర సంస్థలా కాకుండా, రాజకీయ కక్ష సాధింపు సాధనంలా కనిపించడం మొదలుపెడితే, ప్రజల ముందు ఒక తీవ్రమైన ప్రశ్న మిగిలిపోతుందని తెలిపారు. అది మనం చూస్తున్నది దర్యాప్తునా లేక ప్రభుత్వ ప్రాయోజిత నాటకమా? అని గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థలు స్వాతంత్ర్యం, పారదర్శకత, సక్రమమైన ప్రక్రియ ద్వారా ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తాయని ఆయన పేర్కొన్నారు. వాటి స్థానంలో రాజకీయ బాటలు వచ్చినప్పుడు, ఆ విశ్వాసమే మొదట దెబ్బతింటుందని హెచ్చరించారు.














Click it and Unblock the Notifications
