అడివి శేష్ 'జీ 2 ' రిలీజ్ డేట్ పై కీలక అప్ డేట్.. ఫిబ్రవరి 5న థియేటర్లలోకి..

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. ఆయన స్టోరీ సెలక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. చాలామంది యువ హీరోలు మాస్ సినిమాలు, లవ్ రొమాంటిక్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ అడివి శేష్ మాత్రం నా రూటే సెపరేట్ అంటూ పూర్తిగా థ్రిల్లర్, సస్పెన్స్, బయోగ్రఫీ, యాక్షన్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. 2016 లో క్షణం మూవీతో తొలి సినిమాతోనే విభిన్న కథాంశంతో రెచ్చిపోయారు అడివి శేష్. ఆ తర్వాత 2018లో గూఢచారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక ఎవరు, మేజర్, హిట్ ది సెకండ్ కేస్, డెకాయిట్ సినిమాలతో వరుసగా హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ప్రస్తుతం అడివి శేష్ G2 చిత్రంతో బిజీగా ఉన్నారు. 2018లో వచ్చిన గూఢచారి సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ స్పై థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా మెప్పించనున్నారట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నట విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు G2 చిత్రంలోనూ ఆయన విలన్ గా వైవిధ్యమైన రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

AdiviSesh Key update on the release date of Adivi Sesh s G2 arriving in theaters on February 5

భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. అందుకే ఈ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ చిత్రం ద్వారా వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమాలో జీ2 మూవీ స్పై థ్రిల్లర్ జానర్‌ ను రీడిఫైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే డీసీ చిత్రంతో అలరించిన వామికా గబ్బి ఈ మూవీలో ఏజెంట్ 116గా ఎంట్రీ ఇవ్వనుంది. దాంతో ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+