పృథ్వీ షాతో బంధానికి స్వస్తి చెప్పిన కాబోయే భార్య.. అసలేం జరిగింది?

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, అతన కాబోయే భార్య ఆకృతి అగర్వాల్‌ల మధ్య ఉన్న బంధం ముగిసింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టకముందే వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఎంగేజ్మెంట్ రద్దయిందని, ఇద్దరి సమ్మతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా ధ్రువీకరించారు.

Asian Games 2026: నేటి నుంచే ఆసియా గేమ్స్ హంగామా.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇదిగో!
Asian Games 2026: నేటి నుంచే ఆసియా గేమ్స్ హంగామా.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇదిగో!

ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలో చెబుతూ.. "చాలా బరువైన హృదయంతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. నేను, నా కాబోయే భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తు, జీవిత లక్ష్యాల పట్ల మా ఆలోచనలు వేర్వేరుగా ఉండటంతో ఇకపై కలిసి ముందుకు సాగలేమని భావించాం. ప్రస్తుత పరిస్థితులు, బాధ్యతల దృష్ట్యా ఇద్దరికీ మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆకృతి అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే తమ ఇద్దరి మధ్య ఇప్పటికీ పరస్పర ప్రేమ, గౌరవం ఉన్నాయని.. అనవసరమైన ఊహాగానాలకు తావివ్వకుండా తమ ప్రైవసీని గౌరవించాలని నెటిజన్లను కోరారు.

Indian Cricketer Prithvi Shaw Breakup Engagement Canceled with Akriti Agarwal Check Details
రష్యా-భారత్-చైనాలకు ట్రంప్ షాక్..! బ్రిక్స్ కోపం తీర్చుకున్నారా ?
రష్యా-భారత్-చైనాలకు ట్రంప్ షాక్..! బ్రిక్స్ కోపం తీర్చుకున్నారా ?

వీరిద్దరి ఎంగేజ్మెంట్ మార్చి 8న ఎంతో ఘనంగా జరిగింది. ఆ తర్వాత కలిలి విదేశీ పర్యటనలకు వెళ్లడం, సోషల్ మీడియాలో సంతోషకరమైన క్షణాలను పంచుకోవడంతో అభిమానులు ఈ జంటను ఎంతో ఆదరించారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా వీరి మధ్య విభేదాలు వచ్చాయని, పృథ్వీ షా ప్రవర్తనపై కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆకృతి అగర్వాల్ వాటిని అప్పట్లో ఖండించారు. కానీ చివరకు 6 నెలల వ్యవధిలోనే ఈ ఎంగేజ్మెంట్ అధికారికంగా రద్దు కావడంతో ఈ వార్త క్రికెట్, సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై పృథ్వీ షా ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా మౌనం వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+