రైట్ టైమ్ రైట్ లీడర్ పీఎం మోడీ.. సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం!

భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజున ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీపైన ప్రశంసలజల్లు కురిపించారు. వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్‌లో మాట్లాడిన చంద్రబాబు రామజన్మ భూమి మొదలుకుని... ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. కాశీ క్షేత్రం ప్రధాని నరేంద్ర మోదీ కర్మభూమి అని, కాశీ నుంచి మోదీ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాశీ పుణ్యక్షేత్రం వారణాసికి నేతను ఎన్నుకోవడమే కాదు... దేశానికి ఓ లీడర్‌ను అందించిందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుస్తున్నారని కొనియాడారు. VKS అనేది అభివృద్ధి మంత్రం... ఈ మంత్రంతో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయని తెలిపారు.జేజేఎం, అమృత్ వంటి పథకాల ద్వారా 4 కోట్ల ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించారన్నారు.

chandrababu praises modi at Seva Sankalp Abhiyan in Varanasi speaks about Ram Janmabhoomi to Operation Sindoor

పీఎం కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భంలో నరేంద్ర మోదీ దేశానికి మంచి నాయకత్వం అందించారు.140 కోట్ల మంది భారతీయులను కాపాడారు... వారికి ఇబ్బందులు కలగకుండా చేశారన్నారు.200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసేలా ప్రొత్సహించిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడారని గుర్తు చేశారు.

ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ గ్లోబల్ ఇలాంటి విధానాలతో మేకిన్ ఇండియా కాన్సెప్ట్ బలోపేతం అయ్యేలా చేశారు. గతంలో డిఫెన్స్ పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరామన్నారు. ప్రధాని దూరదృష్టితో 2.20 లక్షల స్టార్టప్ ల ద్వారా యువత ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకున్నారు. భేటీ బచావో-భేటీ పడావో, లక్పతీ దీదీ మహిళా సాధికారతకు నిదర్శనం అన్నారు.

ఉజ్వల పథకం ద్వారా క్లీన్ ఫ్యూయల్ అందిస్తుంది.. ముద్ర పథకం పెట్టుబడి సమకూరుస్తుందన్నారు. నారీ శక్తి అధినియం ద్వారా చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు.. ఇది గేమ్ ఛేంజర్ కాబోతోందని స్పష్టం చేశారు. ప్రపంచం ముందు భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెట్టారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ధీటైన సమాధానమిచ్చి...భారత్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

ఇప్పుడు దేశంలో నక్సలిజం, మావోయిజాన్ని రూపుమాపారు... దటీజ్ నరేంద్ర మోదీ అని కొనియాడారు. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇటీవలే బ్రిక్స్ సదస్సును కూడా సమర్థవంతంగా నిర్వహించారన్నారు. 25 ఏళ్ల పాటు కంటిన్యూగా పాలనలో ఉండడం మామూలు విషయం కాదు. రైట్ టైమ్.. రైట్ లీడర్ నరేంద్ర మోదీ.. దేశాన్ని నరేంద్ర మోదీ అభివృద్ధి వైపునకు నడిపిస్తున్నారన్నారు. .ఏపీకి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభిస్తోంది. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తున్న మద్దతును ఏపీ ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు సీఎం చంద్రబాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+