కేసీఆర్ అడ్డంగా దొరికారు - ఇవిగో ఆధారాలు..!
మాజీ సీఎం కేసీఆర్ భూముల వ్యవహారం రాజకీయ వివాదంగా మారుతోంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన ఆరోపణలతో ఒక్క సారిగా రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే వ్యవహారం పై సీఎం రేవంత్ ఆదేశాలతో విచారణ మొదలైంది. కాగా.. కేసీఆర్ భూములను ఆక్రమించినట్లు అధారాలు ఉన్నాయని పొంగులేటి కీలక అంశాలను బయట పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది.
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కేసీఆర్ ఫాంహౌస్ ఆధీనంలో 700 ఎకరాలు ఉందని.. ఫాంహౌస్ భూమిని తేల్చాలని కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. 30 రోజుల్లోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి భూమి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని ప్రకటించారు. కేసీఆర్‌కు తక్షణం నోటీసులు ఇచ్చి భూమి స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. అధికారులు రంగంలోకి దిగారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు తమ స్థలాల వ్యవహారం ఎన్నికల అఫిడవిట్ లో చూపించామని చెప్పుకొచ్చారు.

కాగా.. 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనకు ఒక్క ఎకరం భూమీ లేదని కేసీఆర్ పేర్కొన్నారని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో.. ఆ తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములు, ఆస్తులు ఊహించని రీతిలో పెరిగాయని రికార్డుల ద్వారా తెలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ @KCRBRSPresident ...
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 17, 2026
ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!
తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు… pic.twitter.com/E9oOjS8UBW
తనకు ఒక్క ఎకరం కూడా భూమిలేదని 2004 కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన కేసీఆర్‌కు, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్‌కు భూములు భారీగా పెరిగిన విషయం.. స్వయంగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి.

కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే అంటూ మండిపడ్డారు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం.. పుట్టుకతోనే కేసీఆర్‌కు వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు' అని పొంగులేటి 'ఎక్స్' లో రాసుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు ఈ ఆరోపణ లపైన కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.














Click it and Unblock the Notifications
