BIS: భారీగా పెరిగిన హాల్‌మార్కింగ్ ఛార్జీలు! బరువుతో సంబంధం లేదు..
అమెరికా కేంద్ర బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' ఊహించని నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరాయి. గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన వడ్డీ రేట్లకు ఒక్కసారిగా బ్రేక్ వేసి, మళ్లీ పెంచే దిశగా అడుగులు వేయడం ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ హఠాత్ నిర్ణయానికి ప్రధాన కారణాలేంటో వివరంగా చూద్దాం.
తగ్గని ద్రవ్యోల్బణం.. బాదుతున్న చమురు ధరలు
అమెరికాలో సగటు మనిషిని పిండేస్తున్న 'ద్రవ్యోల్బణం' అదుపులోకి రాకపోవడమే ఈ నిర్ణయానికి ముఖ్య కారణం. ఫెడ్ లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి పరిమితం చేయడమే అయినప్పటికీ, జులైలో అది 3.7 శాతంగా నమోదు కాగా, ఆగస్టులో మళ్లీ పెరిగి రికార్డు స్థాయికి చేరింది. దీనికి తోడు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధ మేఘాల కారణంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటిపోవడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. కేవలం సరఫరా వ్యవస్థలో లోపాల వల్లే ధరలు పెరుగుతున్నాయనే పాత భావనను పక్కనపెట్టి, ఆర్థిక వ్యవస్థలోనే అంతర్లీనంగా ధరల మంట ఉందనే విషయాన్ని ఫెడ్ గుర్తించింది.

ఆర్థిక వ్యవస్థ పటిష్టత ఇచ్చిన ధైర్యం
సాధారణంగా వడ్డీ రేట్లు పెంచితే ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే భయం ఉంటుంది. కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాటిచెబుతున్న స్థిరత్వమే ఫెడ్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నిరుద్యోగిత రేటు కేవలం 4.1 శాతంగానే ఉండటంతో పాటు, రాబోయే సంవత్సరాల్లో (2026-2027) జీడీపీ వృద్ధి రేటు 2.3 నుంచి 2.4 శాతంగా నమోదు కావచ్చని అంచనాలు వేస్తున్నారు. మార్కెట్ ఇంకా బలంగానే ఉంది కాబట్టి, వడ్డీ రేట్లు పెంచినా తట్టుకోగలదనే నమ్మకంతోనే పాలసీ మేకర్స్ ఈ కఠిన నిర్ణయానికి ఓటేశారు.
ట్రంప్ కోరికకు భిన్నంగా వర్ష్ సరికొత్త మార్క్
మే నెల చివరిలో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన 'కెవిన్ వర్ష్' హయాంలో తీసుకున్న తొలి వడ్డీ రేట్ల నిర్ణయం ఇదే కావడం విశేషం. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించాలని బహిరంగంగానే కోరుతూ, ఆ భావాలున్న వర్ష్‌ను ఈ పదవిలో కూర్చోబెట్టారు. అయితే, అధ్యక్షుడి ఆశయాలకు భిన్నంగా వర్ష్ నేతృత్వంలోని ఫెడ్ బోర్డు ఏకగ్రీవంగా రేట్లను పెంచడానికే మొగ్గుచూపింది. ఆ మధ్య జరిగిన జాక్సన్ హోల్ సమావేశంలోనే వర్ష్ మాట్లాడూ.. ధరల మంట పూర్తిగా చల్లారే వరకు కఠిన నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గేదే లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారు.
మున్ముందు మరిన్ని పెంపులు తప్పవా?
గతంలో జులై 2023లో చివరిసారిగా వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్, ఆ తర్వాత దశలవారీగా ఆరుసార్లు కోతలు విధిస్తూ దాదాపు 175 బేసిస్ పాయింట్ల వరకు రేట్లను తగ్గించింది. కానీ, ఇప్పుడు ఆ ఊరట కాలానికి తెరపడింది. ఈ విడతలో చేసిన 25 బేసిస్ పాయింట్ల పెంపు కేవలం ఆరంభం మాత్రమేనని, ధరల నియంత్రణకు ఈ ఏడాదిలో మరిన్ని పెంపులు తప్పకపోవచ్చని ఫెడ్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడులు, రుణాలు మరింత ప్రియం కానున్నాయి.














Click it and Unblock the Notifications
