కాశీ విశ్వనాథుడి సేవలో సీఎం చంద్రబాబు, మోదీ పుట్టినరోజు వేళ పూజలు
వారణాసి క్షేత్రంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని పవిత్ర జలాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినంతో పాటు ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాపాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని చేపట్టిన 'వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు నిర్వహించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో కలిసి సీఎం చంద్రబాబు ఆలయంలో స్వామివారిని దర్శించుకోగా, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నేతలందరూ కలిసి కాశీ క్షేత్రంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ కూడా పాల్గొన్నారు.

సేవా యాత్రలో చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగ వ్యాఖ్యలు!
అనంతరం వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన 'వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్' సభలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీజేపీ యూపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేదికపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం చంద్రబాబు తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్‌కు అత్యంత ఆప్తమిత్రుడని, కుటుంబ కష్టసుఖాల్లో ఆయనకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచారని గతాన్ని గుర్తుచేసుకున్నారు.














Click it and Unblock the Notifications
