పవన్ కళ్యాణ్ మాటల కంటే ఆయన చేతలే పవర్ ఫుల్.. ఇదే ఎగ్జాంపుల్!
పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన ఏపీలో నిర్మాణాత్మకమైన పని చేస్తున్నారు. ఏపీ లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన మాట కంటే ఆయన చేసిన పని మాట్లాడుతుంది. అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పేలా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా రోడ్ల నిర్మాణం జోరుగా జరుగుతోంది.
గత రెండున్నరేళ్లలో గ్రామాల్లో మొత్తం 20,600 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. వీటిలో 10 వేల కిలోమీటర్లు తారు రోడ్లు, మరో 9,600 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఉన్నాయి. గిరిజన గ్రామాలకు అడవి తల్లి బాట పథకం కింద వెయ్యి కిలోమీటర్లకు పైగా రహదారి సౌకర్యం కల్పించినట్లు కూడా పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఈ వివరాలను పోస్ట్ చేశారు.

రైతులకు అండగా 1.15 లక్షల పంట కుంటలు నిర్మించినట్లు చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు లక్షల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి రైతులకు సహాయం అందించినట్లు తెలిపారు. పాడి రైతుల కోసం 38 వేల మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు నిర్మించారని వివరించారు. ఏడున్నర దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు తొలిసారి రహదారులు వేసినట్లు ఆయన ప్రస్తావించారు.
గత ప్రభుత్వ కాలంలో విగ్రహాలు ధ్వంసమై అపవిత్రమైన రామతీర్థంలో భక్తుల సౌకర్యార్థం ఉపాధి హామీ పథకం కింద రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, కోటప్పకొండ, ఐఎస్ జగన్నాథపురం వంటి వందలాది పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ రోడ్లు వేసినట్లు తెలిపారు.
ఈ పనులతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడి, రైతులు, సామాన్య ప్రజలు సులభంగా ప్రయాణించగలుగుతున్నారని పవన్ కళ్యాణ్ పోస్ట్ తో ఆర్షం అవుతుంది. పవన్ కల్యాణ్ ఈ వివరాలతో పాటు రోడ్ల ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పిస్తోందని ఈ పోస్ట్ ద్వారా ఆయన పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన వంతు సహాయం అందించి రాష్ట్ర ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి దోహదం చేశారు.












Click it and Unblock the Notifications
